సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:57 PM
తావరణంలో వస్తు న్న మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు సోకే అవ కాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనిత అన్నారు.
డీఎంహెచ్‌వో డా.అనిత
అరసవల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో వస్తు న్న మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు సోకే అవ కాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనిత అన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నీటి ద్వారా, కలుషిత ఆహారం ద్వారా అధికంగా వ్యాధులు ప్రబలుతా యన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆరోగ్యశాఖ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల సమ న్వయంతో కార్యాచరణ చేపడుతున్నామన్నారు. తాగునీటి ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో నీటి పరీక్షలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డేను పాటిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో దోమల నివా రణకు డ్రోన్ల సాయంతో మందులు పిచికారీ చేపట్టనున్నా మని తెలిపారు. వర్షాకాలంలో ఎక్కువగా అతిసార, టైఫా యిడ్, పచ్చ కామెర్లు వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని, అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. సమావేశంలో డీఐవో డాక్టర్ రాందాసు, ఎస్‌ఏ రామనాగేశ్వరరావు, ఏవో బాబూరావు, డిప్యూటీ డెమో ఎం.వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 11:57 PM