ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గొడ్డలితో దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు

ABN, Publish Date - Apr 28 , 2025 | 11:57 PM

నౌపడకు చెందిన దుక్క సంతోష్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన జీరు శంకర్‌రెడ్డి సోమవారం రాత్రి గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.

గాయపడిన సంతోష్‌కుమార్‌

సంతబొమ్మాళి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): నౌపడకు చెందిన దుక్క సంతోష్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన జీరు శంకర్‌రెడ్డి సోమవారం రాత్రి గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. నౌపడ పోలీసులు, స్దానికుల తెలిపిన వివరాల మేరకు.. దుక్క రమేష్‌ స్నానం చేస్తుండగా ఆ నీరు జీరు శంకర్‌రెడ్డి ఇంటి ముందుకు వెళ్లడంతో గొడవ ప్రారంభమైంది. ఇది వారి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో రమేష్‌ అన్న కుమారుడు సంతోష్‌కుమార్‌ వచ్చి ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మద్యం మత్తులో ఉన్న శంకర్‌రెడ్డి తన ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకువచ్చి సంతోష్‌కుమార్‌పై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన సంతోష్‌కుమార్‌కు నౌపడ పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన శంకర్‌రెడ్డి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నౌపడ పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 28 , 2025 | 11:57 PM