Plastic eradication: ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించాలి
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:06 AM
Environmental awareness ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
పేద కుటుంబాల దత్తతను వేగవంతం చేయాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్లాస్టిక్ విని యోగం వలన కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించ డానికి మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించాలి. స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో మహిళలకు ప్లాస్టిక్ ప్రత్నామ్యాయాలపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల’ని ఆదేశించారు. అలాగే పేద కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని వేగవంతం చేయా లని తెలిపారు. తుది అర్హుల జాబితా ఆధారంగా మార్గదర్శులను సంప్రదించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోందన్నారు. పారి శ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలను సంప్రదించి బంగారు కుటుంబాలకు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు సహకారం అందేలా చర్య లు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎం.వేంక టేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 12:06 AM