ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటో-ఆర్టీసీ బస్సు ఢీ.. 12 మందికి గాయాలు

ABN, Publish Date - May 22 , 2025 | 12:05 AM

బందరువానిపేట గ్రామం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు 12 మంది గాయపడ్డారు.

గార, మే 21(ఆంధ్రజ్యోతి): బందరువానిపేట గ్రామం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు 12 మంది గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బందరు వానిపేట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, కళింగపట్నం వైపు నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డు మలుపు వద్ద ఢీకొన్నాయి. ఆటోలో ప్రయా ణిస్తున్న పుక్కళ్ల లక్ష్మి, దేవీశ్రీ, గౌతమి తీవ్రంగా గాయపడ గా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌ ఔట్‌పోస్టు పోలీ సులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఎం.చిరంజీవి తెలిపారు.

బంగారం షాపులో చోరీ

పలాసరూరల్‌, మే 21(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ బంగారు షాపులో బుధవారం సినీఫక్కీలో చోరీ జరిగింది. కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. షాపునకు ఒక యువకుడు వచ్చి బంగారం కావాలని కోరగా షాపు యజమాని బంగారం చైన్లు చూపించారు. వాటిని చూస్తున్నట్లు నటిం చిన ఆ యువకుడు ఒక్కసారిగా మూడు తులాలకు పైగా బరువు కలిగిన చెయిన్‌ ను పటుట్టకుని ఉడాయించాడు. షాపు యజమాని బయటకు వచ్చి ఎంత వెతి కినా అతడి ఆచూకీ కనిపించక పోవడంతో కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలాస-కాశీబుగ్గ జంక్షన్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా సదరు యువకు డు ఒకచోట షర్టు ధరించి కనిపించగా మరో చోట టీషర్టుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.

Updated Date - May 22 , 2025 | 12:05 AM