ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Warrants : వారెంట్లు.. సమన్లపై శ్రద్ధ వహించాలి

ABN, Publish Date - May 12 , 2025 | 11:59 PM

Warrants Summons Law enforcement ప్రతీ కేసులో కోర్టు జారీ చేసిన నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లు, సమన్ల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
  • ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి

  • శ్రీకాకుళం, క్రైం, మే 12(ఆంధ్రజ్యోతి): ప్రతీ కేసులో కోర్టు జారీ చేసిన నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లు, సమన్ల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారెంట్లు, సమన్ల అమలు, పెండింగ్‌కు గల కారణాలను విశ్లేషించి, పలు సూచనలు చేశారు. కోర్టు జారీ చేసిన ఎన్‌బీడబ్ల్యూ(నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లు), సమన్ల అమలులో నిర్లక్ష్యం వహించరాదని, వాటిని ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని తెలిపారు. మహిళలపై నేరాలు, శారీరక దాడులు, మోసాలు, గృహహింస, హత్య, అట్రాసిటీ, పోక్సో వంటి కేసుల్లో ఎన్‌బీడబ్ల్యూ అమలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వీటి అమలుకు సంబంధించి ప్రతీ పోలీసు స్టేషన్‌లో రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.వి.రమణ, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, సైబర్‌ సెల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ నేతాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:59 PM