ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రసాదం తయారీ సమయంలో దాడి

ABN, Publish Date - May 23 , 2025 | 12:27 AM

హనుమజ్జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రసా దం తయారీ సమయంలో ఓ మహిళపై బంధు వులు దాడి చేసిన ఘటన అనంతగిరి గ్రామంలో గురువారం జరిగింది.

అనంతగిరిలో ఘటన

భూ తగాదాలే కారణమా?

వజ్రపుకొత్తూరు, మే 22(ఆంధ్రజ్యోతి): హనుమజ్జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రసా దం తయారీ సమయంలో ఓ మహిళపై బంధు వులు దాడి చేసిన ఘటన అనంతగిరి గ్రామంలో గురువారం జరిగింది. పోలీ సులు, బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఆల యంలో హనుమజ్జయంతి ఉత్సవాలను నిర్వహి స్తున్నారు. ప్రసాదం తయారీ చేస్తున్న సమయం లో జనపాన రమణమ్మపై అదే గ్రామానికి చెందిన, బాగారులైన జనపాన సాంబమూర్తి, ఇద్ద రు కుమారులు దాడి చేశారు. ఈ సమ యంలో పక్కనే ఉన్న వంట పొయ్యిలోకి ఆమెను నెట్టే యడంతో తీవ్ర గాయాల య్యాయి. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ప్రథ మ చికిత్స కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరు గైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.నిహార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రెండు కుటుం బాల మధ్య భూ తగాదాలు కొన్నేళ్లుగా ఉన్నాయని, ఇవే ఈ దాడికి కారణమై ఉంటాయన్న అనుమానాలను స్థానికులు వ్యక్తంచేస్తున్నారు.

14 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌

వజ్రపుకొత్తూరు, మే 22(ఆంధ్రజ్యోతి): దేవునల్తాడ సమీపంలోని పొలా ల్లో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్ట్‌ చేసి నట్లు ఎస్‌ఐ బి.నిహార్‌ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.72 వేల నగదు, ఆరు బైక్‌లు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండు రోజులుగా దేవునల్తాడ సమీపంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సిబ్బందితో దాడి చేశామన్నారు. ఏ గ్రామంలోనైనా పేకాట నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు.

Updated Date - May 23 , 2025 | 12:27 AM