tollgate టోల్‌గేట్ సిబ్బందితో వాగ్వాదం
ABN, Publish Date - May 29 , 2025 | 11:42 PM
పలాస మండ లం లక్ష్మీపురం సమీపంలో ఉన్న హైవే టోల్‌గేట్ వద్ద అధిక లోడ్ చూపించా రంటూ ఓ లారీ డ్రైవర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటన బుధవారం రాత్రి సంభవించింది.
ఎక్కువ లోడు చూపించారంటున్న లారీ డ్రైవర్
పలాసరూ రల్, మే 29 (ఆంధ్రజ్యోతి): పలాస మండ లం లక్ష్మీపురం సమీపంలో ఉన్న హైవే టోల్‌గేట్ వద్ద అధిక లోడ్ చూపించా రంటూ ఓ లారీ డ్రైవర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటన బుధవారం రాత్రి సంభవించింది. కాకినాడకు చెందిన ఓ లారీ డ్రైవర్ జార్ఖండ్ రాష్ట్రం జమ్‌షెడ్‌పూర్ నుంచి టూల్స్‌తో కాకినాడకు వెళ్తూ బుధవారం రాత్రి లక్ష్మీ పురం టోల్‌గేటు వద్దకు చేరు కుంది. ఐదు లైన్లలో మొదటి లైనులోకి ఆ లారీ రాగానే అధిక బరువు ఉందని చెప్పడంతో డ్రైవర్ రమేష్ టోల్‌గేటు సిబ్బందిని ప్రశ్నించారు. జమ్‌షెడ్‌పూర్ నుంచి తాను వస్తున్నానని, అన్ని చోట్ల తన లారీ సరైన బరువుతోనే ఉందని, కేవలం ఒక్క పలాసలోనే అధిక బరువు ఏమిటని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. డ్రైవర్ లోడు వివరాలు, ఇతర సమాచారం కలిగిన పత్రాలను చూపించినా టోల్‌గేటు సిబ్బంది పట్టించు కోలేదు. లారీని నిలుపుదల చేయడంతో ఇతర డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో లారీ డ్రైవర్ వివా దంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. సదరు డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి డ్రంకెన్‌డ్రైవ్ పరీక్ష చేశారు. అయితే ఆ ఛాయలు ఏమీ లేకపోవడంతో రూ.1035 వసూలు చేసి వదిలివేశారు. దీంతో లారీ డ్రైవర్ దిక్కుతోచని స్థితిలో పలాస నుంచి మరలా టోల్‌గేటు వద్దకు వచ్చాడు. జరిగిన ఘట నను విజయవాడలోని లారీ ఓనర్ల సంఘం ప్రతినిధులకు సదరు డ్రైవర్ రమేష్ వివరించారు. ఈ వివాదం జరుగుతుండగా కాశీబుగ్గ-పలాస ఇతర ప్రాంత లారీ, ట్రక్కు డ్రైవర్లు అక్కడకు చేరుకున్నారు. టోల్ సిబ్బంది అధికంగా వసూలు చేస్తున్నారని, దీనిని ప్రశ్నిస్తే గొడవకు దిగుతున్నారని ఆరోపించారు. ఘటనా స్థలానికి ఏఎస్‌ఐ గోవిందరాజులు గురువారం ఉదయం చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. లారీ ఓనర్స్ అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహారధి లారీ డ్రైవర్లతో కలిసి కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావుకు ఫిర్యాదు చేశారు. మరలా ఇటువంటి వివాదాలు పునరావృతం కాకుండా ఇరువర్గాలు చూడాలని, టోల్‌గేటు సిబ్బంది అక్రమ వసూలుకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మరలా ఇలాంటి వివాదం లేకుండా ఇరువర్గాలు జాగ్రత్త పడాలని సూచించారు.
Updated Date - May 29 , 2025 | 11:42 PM