APPSC EXAM: నేటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:44 PM
APPSC recruitment ఏపీపీఎస్సీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా రెవెన్యూ అఽధికారి ఎం.వేంకటేశ్వరరావు తెలిపారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా రెవెన్యూ అఽధికారి ఎం.వేంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఈ నెల 15 నుంచి 23 వరకు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. 743 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల(ఎచ్చెర్ల), శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల (ఎచ్చెర్ల), కోర్ టెక్నాలజీస్(నరసన్నపేట), ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(టెక్కలి) కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతీ కేంద్రంలో బయోమెట్రిక్ ధ్రువీకరణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసుభద్రత, వైద్య సహాయం, నిరంతర విద్యుత్తు సరఫరా వంటి ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులు ఒరిజినల్ ఫొటో ఐడీ తీసుకురావాలి. ఎలకా్ట్రనిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, పేపర్లు వంటి వాటికి అనుమతి ఉండదు. ఉదయం పరీక్షకు 8 నుంచి 8-45 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షలకు 1 గంట నుంచి 1-45 గంటల వరకు అనుమతిస్తాం. ఈ సమయానికి అదనంగా మరో 15నిమిషాల వెసులుబాటు ఉంటుంద’ని తెలిపారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు ఏ.కృష్ణవేణి, ఎం.అమ్మాజీ, రూరల్ సీఐ పైడపునాయుడు, డిప్యూటీ తహశీల్దార్లు ఎస్.బాలకృష్ణ, డి.రామకృష్ణ, పి.నిరంజన్‌కుమార్, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:44 PM