ఏపీ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:26 PM
పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్-2015 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం) ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయకర్త కె.నారాయణరావు తెలిపారు.
ఎచ్చెర్ల, జూలై 16(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్-2015 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం) ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయకర్త కె.నారాయణరావు తెలిపారు. తొలి విడతలో సీటు పొందిన విద్యార్థులు కళాశాల మారాలనుకుంటే వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చన్నారు. అలాగే తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు కూడా ప్రొసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకోవాలన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రొసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్లు పరిశీలన పూర్తిచేయాలన్నారు. 18 నుంచి 20వ తేదీలోగా వెబ్ ఆప్షన్లను నమోదుచేసుకోవాలని, 21న ఆప్షన్లను మార్చుకోవాలని అన్నారు. ఈ నెల 22న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. 23 నుంచి 25వ తేదీలోగా సీటు పొందిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని అన్నారు.
పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్..
పాలిసెట్ -2025 ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(శ్రీకాకుళం), సహాయ కేంద్రం సమన్వయకర్త కె.నారాయణరావు తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరై సీటు పొందిన విద్యార్థులు తిరిగి బ్రాంచ్, కళాశాల మారాలనుకున్నవారు ఆప్షన్లను ఇచ్చుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు ఈ నెల 17 నుంచి 19లోగా ప్రొసెసింగ్ ఫీజును చెల్లించాలన్నారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీలోగా సహాయ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకుని, కళాశాలలు, బ్రాంచ్‌ల ఎంపికకు ఆప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 21న సీట్లు కేటాయిస్తారని, 24 నుంచి 26వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
Updated Date - Jul 16 , 2025 | 11:26 PM