EAP Cet: ముగిసిన ఏపీ ఈఏపీ సెట్
ABN, Publish Date - May 28 , 2025 | 12:03 AM
EAPCET exam concluded ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న ఏపీ ఈఏసీ సెట్ మంగళవారంతో ముగిసింది. జిల్లాలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల(చిలకపాలెం), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల(ఎచ్చెర్ల), కోర్ టెక్నాలజీ (నరసన్నపేట), ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంటు (టెక్కలి)లో ఈ పరీక్షలు నిర్వహించారు.
- నాలుగు కేంద్రాల్లో 12,633 మంది హాజరు
ఎచ్చెర్ల, మే 27(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న ఏపీ ఈఏసీ సెట్ మంగళవారంతో ముగిసింది. జిల్లాలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల(చిలకపాలెం), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల(ఎచ్చెర్ల), కోర్ టెక్నాలజీ (నరసన్నపేట), ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంటు (టెక్కలి)లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ నాలుగు కేంద్రాల్లోనూ 13,298 మంది విద్యార్థులకుగానూ 12,633 మంది(95 శాతం) హాజరయ్యారు. ఇందులో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి బైపీసీ స్ట్రీమ్‌లో 3,864 మంది దరఖాస్తు చేయగా, 3,571 మంది(92.42 శాతం) పరీక్ష రాశారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి 9,434 మందికిగానూ 9,062 మంది(96.17 శాతం) హాజరయ్యారు. మంగళవారం శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో 280 మందికి 271 మంది, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో 168 మందికి 161 మంది పరీక్ష రాశారు.
Updated Date - May 28 , 2025 | 12:03 AM