సమష్టి కృషితోనే అద్భుత విజయం: కలెక్టర్
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:00 AM
: సమష్టి కృషితోనే అద్భుత విజయం సాధించగలిగామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, ఆయుష్ టీమ్‌లను ఆయన అభినందించారు.
శ్రీకాకుళం రూరల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితోనే అద్భుత విజయం సాధించగలిగామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, ఆయుష్ టీమ్‌లను ఆయన అభినందించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లిలోని సంప్రదాయ గురుకులంలో ‘యోగాంధ్ర’ విజయోత్సవ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ కార్యక్రమాన్ని నిర్వహించ గలిగామని.. కీలకపాత్ర పోషించిన అఽన్ని విభాగాల అధికారులు, ప్రజా ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్యెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్వో వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయిప్రత్యూష, ఆయుష్ జిల్లా అధికారి డా. జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 12:00 AM