పది తర్వాత..
ABN, Publish Date - Apr 28 , 2025 | 11:23 PM
తొమ్మిదో తరగతి వరకు ఏదోలా చదివేశారు. పదో తరగతి అలా కాదు.. పబ్లిక్. ఇది కాస్త మంచి మార్కులతో గట్టెక్కితే సూపర్‌రా బాబూ.. అనే వారు నిన్నటి తరం. ఇప్పుడు అలా కాదు. పదో తరగతి తర్వాతే అత్యంత కీలకమని చెబుతున్నారు నేటి తరం. పిల్లల ఆసక్తిని గమనించి, వారు ఏ సబ్జెక్ట్‌లో ప్రతిభ కన్పిస్తున్నారో గుర్తించి ముందుకు నడిపిస్తే సత్ఫలి తాలు సాధించవచ్చు. పదో తరగతి వరకు ఎన్ని కోర్సు లు అందుబాటులోకి వస్తున్నా, ఇంటర్మీడియట్‌కు ఉన్న ప్రాధాన్యం చెక్కు చెదరలేదనే చెప్పాలి.
పదో తరగతి వరకు ఏ పాఠశాలలో చదివినా, ఆ తర్వాత మాత్రం ఏ కోర్సులో, ఎక్కడ చేర్చాలో ఆచితూచి అడుగువేయాలి. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివిస్తే మంచిదో అనే ఆలోచనతో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఎక్కడ చదివించినా, ఏ కోర్సు చదివించినా పిల్లల ఆసక్తిని తెలుసుకోవడం మాత్రం మరిచిపోరాదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేర్చడమే తప్ప, దూరంలో ఉన్న మంచి కోర్సుల్లో జాయిన్ చేద్దామన్న ఆలోచన చేయడం లేదు. తద్వారా వారి పిల్ల లు బంగారు భవితను కోల్పోతు న్నారు. అంతా ఆయిన తర్వా త సరైన కళాశాలలో చది వించలేదని బాధపడేక న్నా, ముందుగానే ప్రణా ళికాబద్ధంగా వ్యవహ రించడంతోనే మంచి ఫలితాలు సాధించవ చ్చని విద్యావేత్తలు అభిప్రాయపడు తున్నారు.
విద్యార్థుల ఆసక్తి మేరకే..
పదో తరగతి తర్వాత చదువుల ఎంపికలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థు ల ఆసక్తి మేర కు ఎంపిక చేసు కోవాలి. ఈ విషయంలో తల్లి దండ్రులు పిల్లల ఆలోచనలు, ఉపా ధ్యాయుల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. నలుగుర్నీ సంప్రదించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే పిల్లల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో..
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల కళాశాలల్లో ప్రవేశం కోసం పదో పరీక్ష రాయాల్సి ఉంటుంది. తాటిపూడి (బాలికలు, విజయన గరం), నాగార్జునసాగర్ (బాలు రు, గుంటూరు), వెంకటగిరి (బాలురు, నెల్లూరు), నిమ్మ కూరు (కో ఎడ్యుకేషన్, కృష్ణా జిల్లా)లో గురుకు ల కళాశాలలు ఉన్నా యి. ఈ కళాశాలల్లో సీటు వస్తే భవితకు బంగారు బాట పడినట్టేనన్న అభిప్రాయం ఉంది.
ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే..
రాజీవ్‌గాంధీ యూని వర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలో శ్రీకాకుళం, నూజివీ డు, ఒంగోలు, ఇడుపులపాయ (ఆర్‌కే వ్యాలీ)లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. ఇది ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు. సాధారణంగా పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ప్రాప్తికి సీట్లను కేటాయిస్తారు. ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే అటు నుంచి అటే బహుళ జాతి కంపెనీల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించవచ్చు.
ఇంటర్‌లో వృత్తివిద్యా కోర్సులు..
వృత్తి విద్యా కోర్సుల వల్ల ప్రయోజనం ఎక్కువే. వెటర్న రీ, అగ్నికల్చరల్, రేడియో అండ్ టీవీ, ఇంజనీరింగ్ టెక్నాల జీ, బిజినెస్ మేనేజ్‌మెంటు, పారా మెడికల్, ఏఎన్‌ఎం, లేబ్ టెక్నీషియన్, కేటరింగ్, డెయిరీ, ఆఫ్తాలమిక్ అసిస్టెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వం నియా మకాలు చేపట్టిన సచివాలయం ఉద్యోగాల్లో చాలామంది వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు ఎంపికయ్యారు. ఇటీవల ఈ కోర్సులు చదివే వారి సంఖ్య పెరిగింది.
పాలిటెక్నిక్ కోర్సులు..
పదో తర గతి తర్వాత సాంకేతిక విద్యలో చేరాలన్న ఆసక్తి ఉంటే పాలిసెట్‌ను రాయాలి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దాదాపు అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా పాలిటెక్నిక్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, కంప్యూటర్స్, కెమికల్, ఆటోమోబైల్ తదితర కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తిచేస్తే పబ్లిక్ మరియు ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాలు సాధించవచ్చు. అలాగే సొంతంగా కూడా ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈసెట్ రాసి ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు.
ఇంటర్మీడియట్‌లో ఇవీ గ్రూపులు..
- ఎంపీసీ: ఈ గ్రూపులో గణితం, భౌతిక, రసా యన శాస్త్రాలు ప్రధాన సబ్జెక్ట్‌లు. ఈ గ్రూపులో చేరే విద్యార్థులకు గణితం పట్ల అమితమైన ఆసక్తి ఉంటే రాణిస్తారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో చేరి ఉన్నతంగా స్థిరపడేందుకు అవకాశముంది.
- బైపీసీ: ఈ గ్రూపులో వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాలు ప్రధాన సబ్జెక్ట్‌లు. ఈ గ్రూపులో చేరి శ్రద్ధగా చదివితే మంచి భవిష్యత్ ఉంటుంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ చూపడం ద్వారా ఎంబీబీఎస్, బీవీఎస్సీ, ఏజీ బీఎస్సీ తదితర కోర్సుల్లో సీటు పొందొచ్చు.
- సీఈసీ: ఈ గ్రూపులో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌లు. ఈ గ్రూపులో చేరిన విద్యార్థులు భవిష్యత్‌లో సీఏలో చేరి ఆడిటర్లుగా స్ధిరపడవచ్చు. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు వస్తుండడంతో వాటిని అందిపుచ్చుకోవచ్చు.
- హెచ్‌ఈసీ: హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌లతో కూడిన ఈ గ్రూపులో చేరి అసాధారణ ప్రతిభ చూపితే మంచి ఉద్యోగాలు పొందొచ్చు. ఏపీపీఎస్సీ, సివిల్స్ మెయిన్స్‌కు ఈ సబ్జెక్ట్‌లే కీలకం కానున్నాయి. చాలామంది సైన్స్ గ్రూపులతో చదివిన వారు కూడా ఈ సబ్జెక్ట్‌లతోనే ఏపీపీఎస్సీ, సివిల్స్‌లో ఎంపికైన సందర్భాలు ఉన్నాయి.
ఐటీఐ కోర్సులు..
పదో తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు అవసరం లేకుండా స్వయం ఉపాధి ఏర్పాటుకు, పరిశ్రమ ల్లో, రైల్వే తదితర రంగాల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఈ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఫిట్టర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర కోర్సులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఐటీఐలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పరిశ్రమల్లో చాలామంది ఐటీఐ చదివిన అభ్యర్ధులు స్థిరపడుతున్నారు.
వ్యవసాయ కోర్సులు..
వ్యవసాయ కోర్సులకు భలే గిరాకీ ఉంది. డిప్లొమో ఇన్ అగ్రికల్చల్, వెటర్నరీ, హార్టికల్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో, విత్తనోత్పత్తి కేంద్రాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ పరంగా వ్యవసాయశాఖలో ఏఈవోలు, ఆత్మ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు సాధించవచ్చు.
పిల్లల ఆసక్తి మేరకే..
పిల్లల ఆసక్తిని తల్లిదండ్రులు గమనించాలి. వారి ఆసక్తి మేరకే ఇంటర్మీడియట్, సాంకేతిక విద్య ఏ కోర్సులో చేరినా.. విద్యార్థులు మానసికంగా సిద్ధంగా ఉన్నట్టయితే రాణించగలరు. ఇష్టం లేని కోర్సులో చేరి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
-డాక్టర్ జి.జానకిరామయ్య, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాకుళం
అభిరుచులను పిల్లలపై చూపొద్దు..
పదో తరగతి తర్వాత చాలా కోర్సు లు అందుబాటులో ఉన్నాయి. కొంత మంది తల్లిదండ్రులు వారి అభిరు చులను పిల్లలపై చూపిస్తారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఏ కోర్సులో చేరినా ఆసక్తి ఉంటే మంచిగా స్థిరపడవచ్చు.
-ఎల్.సుధాకరరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, ఎచ్చెర్ల
Updated Date - Apr 28 , 2025 | 11:23 PM