IIIT Admissions: ట్రిపుల్ ఐటీలో 866 మందికి ప్రవేశాలు
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:00 AM
Triple IT Engineering Admissions రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు నూజివీడు క్యాంపస్‌లో నిర్వహించిన తొలివిడత ప్రక్రియ గురువారం ముగిసింది.
ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్
ఎచ్చెర్ల, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు నూజివీడు క్యాంపస్‌లో నిర్వహించిన తొలివిడత ప్రక్రియ గురువారం ముగిసింది. శ్రీకాకుళం క్యాంపస్‌లో ప్రవేశాలకు నూజివీడులో బుధ, గురువారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ డాక్టర్ సండ్ర అమరేంద్రకుమార్, డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ చేపట్టారు. గురువారం 547 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవగా 429 మంది హజరయ్యారు. ఇందులో 116 మంది బాలురు, 313 మంది బాలికలు ఉన్నారు. తొలిరోజు బుధవారం 517 మందికిగానూ 437 మంది హాజరైన విషయం తెలిసిందే. మొత్తంగా 1,064 మందిని కౌన్సెలింగ్‌కు పిలవగా 866 మంది ప్రవేశాలు పొందారు. వీరిలో బాలురు 243 మంది, బాలికలు 623 మంది ఉన్నారు. తొలి విడతలో మిగిలిన 234 సీట్లను మెరిట్ జాబితా ప్రకారం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఈ నెల 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
Updated Date - Jul 04 , 2025 | 12:00 AM