Arasavalli : ఆదిత్యాలయ ఈవో బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Jun 12 , 2025 | 11:57 PM
Temple Administration అరసవల్లి ఆదిత్యాలయం ఈవోగా కేఎన్‌వీడీ ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.
ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న కేఎన్‌వీడీ ప్రసాద్
అరసవల్లి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): అరసవల్లి ఆదిత్యాలయం ఈవోగా కేఎన్‌వీడీ ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. బాధ్యతలు స్వీకరించిన ఈవోకు ఆలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ఎస్.కనకరాజు, సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులు, బి.ఎస్.చక్రవర్తి, అట్టాడ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 11:57 PM