ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరోసారి తప్పు చేస్తే చర్యలు

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:14 AM

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరోసారి కుళ్లిన కోడి గుడ్లను సరఫరా చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్‌ సీడీపీవో విమలారాణి హెచ్చరించారు.

గుడ్లను పరిశీలిస్తున్న సీడీపీవో విమలారాణి

- ఐసీడీఎస్‌ సీడీపీవో విమలారాణి

- కుళ్లిన కోడి గుడ్ల సరఫరాపై విచారణ

మెళియాపుట్టి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరోసారి కుళ్లిన కోడి గుడ్లను సరఫరా చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్‌ సీడీపీవో విమలారాణి హెచ్చరించారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ఈ గుడ్లు తినేదెలా కథనంపై ఆమె స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం గేదెలపోలూరు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు కుళ్లి కోడి గుడ్లను సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులను పిలిచి మళ్లీ మంచి గుడ్లను అందజేశారు. ఎండల కారణంగా గుడ్లను నిల్వ ఉంచడంతో కుళ్లిపోతున్నాయని తెలిపారు. లబ్ధిదారుల నుంచి వేర్వేరుగా స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. వాటిని పీడీకి పంపిస్తామన్నారు. మరోసారి ఇలా జరిగితే కాంట్రాక్టర్‌తో పాటు కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణలో సూపర్‌వైజర్లు రేణుక, అమరావతి, తదితరులు పాల్గొన్నారు.

చర్యలు ఉండవా?

ఇంకోసారి తప్పుచేస్తే చర్యలు తీసుకుంటామని సీడీపీవో హెచ్చరించారు. దీన్నిబట్టి చూస్తే ఇప్పటి ఘటనను గాలికొదిలేసినట్లేనన్న చర్చ సాగుతోంది. తప్పుచేసిన వారిపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థులు కుళ్లిన కోడిగుడ్ల గురించి చెప్పినా ‘ఇంకోసారి తప్పుచేస్తే..’ అని సీడీపీవో అన్నడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:14 AM