పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోండి
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:02 AM
టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని... అందులోని వారంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
లావేరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని... అందులోని వారంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం లావేరులోని ఓ కల్యాణ మండపంలో మండల టీడీపీ నూతన కార్యవర్గ ఎన్నికలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంకితభావంతో అందరూ పని చేయాలన్నారు. ఇదిలా ఉండ గా... మండల టీడీపీ అధ్యక్ష పదవికి స్వల్ప పోటీ ఏర్పడింది. ఎక్కువ శాతం పాత కమిటీనే కొనసాగించాలని కోరారు. పెద కొత్తపల్లి, చిగిరికొత్తపల్లి, లింగాల వలస, పెదరావుపల్లి, చిన మురపాక, కొత్తకుంకాం గ్రామా ల టీడీపీ నాయకులు, కార్యకర్త లు ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలని సభ ముందు ఉంచారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో శాంతించారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయాని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ఆనెపు రామకృష్ట, మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ తోటయ్యదొర, నాయకులు లంక నారాయణరావు, లంకలపల్లి శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, గొర్లె శ్రీనివాసరావు, కె.దామోదరరావు, మీసాల వెంకటరమణ పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 12:02 AM