వ్యక్తి ఆత్మహత్య
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:05 AM
ఉదయపురం గ్రామానికి చెందిన రాయల తిరుపతి(49) శని వారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ ఏఎస్‌ఐ ప్రకాశరావు తెలిపారు.
పలాస, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఉదయపురం గ్రామానికి చెందిన రాయల తిరుపతి(49) శని వారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ ఏఎస్‌ఐ ప్రకాశరావు తెలిపారు. కాశీబుగ్గ పోలీసుల కథనం మేరకు.. తిరుపతి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవ నం సాగించేవాడు. మద్యం అలవాటు ఉండడంతో అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడేవాడు. శని వారం రాత్రి పూటుగా తాగి ఇంటి సమీపంలోని మండపం మీద నిద్ర పోయాడు. ఉదయం ఇంటికి రాక పోయే సరికి మండపం వద్దకు కుటుం బ సభ్యులు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఈ విషయమై కాశీబుగ్గ పోలీసులకు ఆదివారం కుటుంబ సభ్యులు సమా చారం ఇవ్వగా వారు ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. కడుపు నొప్పి తాళ లేక పురుగుల మందు తాగినట్లు సమాచారం. మృతుడికి భార్య శాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ప్రకాశరావు తెలిపారు.
Updated Date - Jun 30 , 2025 | 12:05 AM