ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అతి వేగానికి నిండు ప్రాణం బలి

ABN, Publish Date - May 03 , 2025 | 11:29 PM

జరజాం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొ కరు తీవ్రంగా గాయపడ్డారు.

ఎచ్చెర్ల, మే 3(ఆంధ్రజ్యోతి): జరజాం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొ కరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన అడపా శ్రీను, బాలి సింహాచలం ద్విచక్రవాహనంపై శ్రీకా కుళం వైపు వెళ్తుండగా.. ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఓవర్‌ టేక్‌ చేయ బోయి, ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో రోడ్డుపై పడిన ఈ ఇద్దర్నీ కొంతదూరం వ్యాన్‌ లాక్కోని వెళ్లింది. కాగా, వ్యాన్‌ డ్రైవర్‌ ప్రమాద స్థలం వద్ద ఆగకుండానే వెళ్లిపోయాడు. గాయపడిన వీరిద్దర్నీ శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అడపా శ్రీను మృతిచెందాడు. మృతునికి భార్య సత్యవతి, కుమా రులు హేమంత్‌, నవీన్‌లు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుడి ఆత్మహత్య

శ్రీకాకుళం రూరల్‌, మే 3(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక ఓ వృద్ధుడు మృతి చెందాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కళ్లేపల్లి గ్రామానికి చెందిన కొయ్య తాతారావు(65) శనివారం జీడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న ఉపాధి పథకం కూలీలు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అం దించారు. మద్యం అలవాటుతోపాటు అప్పులు బాధలు భరించలేక తాతా రావు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. భార్య పార్వతి నుంచి పోలీ సులు వివరాలు సేకరించారు. శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

పాతపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేగేటు సమీపంలో కాకి తోట వద్ద గుణుపూర్‌- పూరీ వెళ్లే రైలు ఢీకొని బోయిన కామేశ్వరరావు (57) శనివారం మృతి చెందినట్లు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ షరీఫ్‌ తెలి పారు. మృతుడు పాతపట్నం శివశంకర్‌కాలనీలో ఒకటో వీధిలో నివాసం ఉంటున్నాడు. ఆలాంధ్రరోడ్‌ కూడలిలో చికెన్‌ పకోడీ తదితర వంటకా లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య రమణమ్మ, కుమారుడు ఉన్నారు.

లారీ బోల్తా: ఇద్దరికి గాయాలు

నందిగాం, మే 3(ఆంధ్రజ్యోతి): ఆకులరఘునాథపురం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన లారీ బోల్తా ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కటక్‌ నుంచి విశాఖ జిల్లా పెందుర్తి రైల్వే బోల్టు, నట్లుతో వెళ్తున్న లారీ ఆకుల రఘునాథపురానికి వచ్చే సరికి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ అజ్మర్‌, క్లీనర్‌ పజానీలకు గాయాల య్యాయి. పజానీకి రెండు కాళ్లు విరిగిపోయాయి. వీరిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. క్లీనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేర కు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో: క్రైం

Updated Date - May 03 , 2025 | 11:29 PM