అర్ధరాత్రి కూలిన భారీ వృక్షం
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:28 AM
చిలకపాలెం-పొందూరు రహదారిలో భగవాన్‌దాస్‌పేట సమీపంలో గురువారం అర్ధరాత్రి దశాబ్దాల నాటి భారీ వృక్షం నేల కూలింది.
పొందూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): చిలకపాలెం-పొందూరు రహదారిలో భగవాన్‌దాస్‌పేట సమీపంలో గురువారం అర్ధరాత్రి దశాబ్దాల నాటి భారీ వృక్షం నేల కూలింది. కొద్ది రోజులుగా కురు స్తున్న వర్షాలకు కూకటివేళ్లతో సహా వృక్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారాన్ని అందుకున్న ఎస్‌ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో చేరుకుని ఆ వృక్షాన్ని తొలగించారు. కాగా ఈ రహదారిలో ఇటువంటి భారీ వృక్షాలు చాలా ఉన్నాయని, ప్రమాదకరంగా ఉన్నవాటిని తొలగించేలా ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.
Updated Date - Jul 05 , 2025 | 12:28 AM