ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళ దారుణ హత్య

ABN, Publish Date - Apr 20 , 2025 | 12:03 AM

మండలంలోని గొల్లపేట గ్రామానికి చెందిన ఆవాల భవాని (22) పైడిభీమవరం జం క్షన్‌ సమీపాన ఉన్న ఒకచెరువు వద్ద శనివారం సాయంత్రం హత్యకు గురైంది.

భవాని(ఫైల్‌):

రణస్థలం,ఏప్రిల్‌19(ఆంధ్రజ్యోతి):మండలంలోని గొల్లపేట గ్రామానికి చెందిన ఆవాల భవాని (22) పైడిభీమవరం జం క్షన్‌ సమీపాన ఉన్న ఒకచెరువు వద్ద శనివారం సాయంత్రం హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు..ఆవాల భవాని పైడిభీమవరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తోంది. సాయంత్రం విధులు పూర్తయిన తరువాత ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో ఆమె మెడపై తీవ్రంగా దాడి చేసి..పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన భవానికి రోహిత(2) అనేకుమార్తె ఉంది.భర్త వెంకటసత్యం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. ప్రస్తుతం ఆయన ఒడిశాలో ఉన్నాడు. చెరువు వద్దనున్న భవాని మృత దేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి, క్లూస్‌ టీమ్‌ చేరుకుని పరిశీ లిస్తున్నారు. భవాని ఎలా హత్యకు గురైంది. కారణాలేమిటనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం లోని రిమ్స్‌కు తరలించారు. భవాని సోదరుడు బమ్మిడి సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేశారు

Updated Date - Apr 20 , 2025 | 12:03 AM