25 మద్యం సీసాలు పట్టివేత
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:10 AM
పట్టణంలోని పాత ఆమదాల వలస గేటు వద్ద సోమవారం ఉదయం 25 మద్యం సీసాలతో ఒక వ్యక్తి పట్టుబడినట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు.
ఆమదాలవలస, జూన్ 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాత ఆమదాల వలస గేటు వద్ద సోమవారం ఉదయం 25 మద్యం సీసాలతో ఒక వ్యక్తి పట్టుబడినట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివ రాల మేరకు.. ఏడో వార్డు చింతాడ గ్రామానికి చెందిన గుండ సురేష్ మద్యం సీసాలు ఒక సంచిలో పట్టుకొని అక్కడ ఉన్నట్టు వచ్చిన సమా చారం మేరకు తనిఖీలు చేయగా.. 25 మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తిం చామన్నారు. దీంతో సురేష్‌ను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
జలుమూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) ఎటువంటి అనుమతి పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. తిలారు ఆర్‌ఎస్, యాళ్లపేటల్లో సోమవారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి అనుమా నితుల వివరాలు సేకరించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణించినపుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో జలుమూరు, సారవకోట, పోలాకి ఎస్‌ఐలు బి.అశోక్‌బాబు, అనిల్‌కుమార్, రంజిత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న గేదెల స్వాధీనం
నరసన్నపేట, జూన్ 9(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి అలమండ సంతకు ఒక వ్యాన్‌లో తరలిస్తున్న 16 గేదెలను మడపాం టోల్‌ప్లాజా వద్ద నరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. సోమవారం వాహనాల తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్న సమయంలో వ్యాన్‌లో 16 గేదెలను తరలిస్తుండ గా వాటిలో ఆరు మృతి చెందినట్లు గుర్తించారు. చిన్నవాహనంలో 16 గేదెలను ఎక్కించడంతో పాటు గాలి ఆడకుండా వ్యాన్ చుట్టూ టర్లాలిన్లు కట్టడంతో అవి మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Jun 10 , 2025 | 12:10 AM