ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీజీఆర్‌ఎఫ్‌కు 23 అర్జీలు

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:36 PM

టెక్కలిలో బుధవారం ఈపీడీసీఎల్‌ శ్రీకా కుళం సర్కిల్‌ పరిధిలో నిర్వహించిన సీజీఆర్‌ఎఫ్‌లో విద్యుత్‌ సమస్యలపై వినియోగదారులు 23 అర్జీలను ఆ సంస్థ చైర్మన్‌ బి.సత్యనారాయణకు అందజేశారు.

విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్న సత్యనారాయణ :

టెక్కలి, జూలై 9(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో బుధవారం ఈపీడీసీఎల్‌ శ్రీకా కుళం సర్కిల్‌ పరిధిలో నిర్వహించిన సీజీఆర్‌ఎఫ్‌లో విద్యుత్‌ సమస్యలపై వినియోగదారులు 23 అర్జీలను ఆ సంస్థ చైర్మన్‌ బి.సత్యనారాయణకు అందజేశారు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌, శ్రీనివాసనగర్‌, సైనిక్‌నగర్‌, పాల కేంద్రం రోడ్డు, నందిగాం మండలంలోని లఖిదాసుపురం ప్రాంతాల్లో లోవో ల్టేజ్‌ సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. శ్రీనివాస్‌నగర్‌లో తన అనుమతి లేకుండా సొంత స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారని టం కాలగుప్త అర్జీ ఇచ్చారు.నందిగాం మండలం కణితివూరులో శ్మశాన వాటి కకు విద్యుత్‌లైన్‌ ఏర్పాటులో తాత్సారం చేస్తున్నారని పేడాడ అనీల్‌ కుమార్‌, టెక్కలిలోని కొత్తమ్మతల్లి వీధిలో విద్యుత్‌లైన్లపై జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని, శ్రీరామ కాలనీలో విద్యుత్‌ వాడకపోయినా సర్‌చార్జీల భారం పడుతోందని అర్జీలు ఇచ్చారు.కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్‌ సభ్యులు బి. సులేఖారాణి, ఎస్‌.సుబ్బారావు, ఎన్‌.మురళీకృష్ణ, ఈఈ శంకరరావు, ఏడీ క్రిష్ణమూర్తి, ఏఈ మురళీకృష్ణ, కొంక్యాన కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:36 PM