Fire engines: కొత్తగా 20 అగ్నిమాపక యంత్రాలు
ABN, Publish Date - May 17 , 2025 | 12:15 AM
Fire department విశాఖ రీజియన్‌కు కొత్తగా 20 అగ్నిమాపక యంత్రాలు(ఫైర్‌ఇంజన్లు) మంజూరు చేస్తున్నట్లు రీజనల్ అగ్నిమాపకశాఖ అధికారి డి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాశీబుగ్గ అగ్నిమాపక కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు.
విశాఖ రీజనల్ అధికారి డి.నిరంజన్‌రెడ్డి
పలాస, మే 16(ఆంధ్రజ్యోతి): విశాఖ రీజియన్‌కు కొత్తగా 20 అగ్నిమాపక యంత్రాలు(ఫైర్‌ఇంజన్లు) మంజూరు చేస్తున్నట్లు రీజనల్ అగ్నిమాపకశాఖ అధికారి డి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాశీబుగ్గ అగ్నిమాపక కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖ రీజియన్‌లో 15 ఏళ్లు దాటి ఫైర్ ఇంజన్లు సేవలు అందిస్తున్నాయి. కాలం చెల్లిన ఇంజన్లు వల్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాం. కొత్తగా 20 ఫైర్ ఇంజన్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి వీటిని ఒక్కొక్కటి రూ.60లక్షలకు చొప్పున కొనుగోలు చేయనున్నాం. విజయనగరం జిల్లాలో నాతవలస, విశాఖలో ఎండాడ, సింహాచలం, కాపులుప్పాడ, అరకు, చింతూరు, పాడేరు ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి నిర్మాణానికి రూ.2 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం. సోంపేట, బొబ్బిలి, పాలకొండ, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరంలో శిథిలావస్థకు చేరుకున్న ఫైర్‌స్టేషన్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు చేపడతామ’ని తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ అధికారి సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 12:15 AM