లక్షా 15 వేల పింఛన్ల మంజూరు
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:41 PM
: రాష్ట్రంలో లక్షా15వేల మంది వితంతు పింఛన్లు ఈనెలలో మంజూరు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడుతెలిపారు.
టెక్కలి, జూలై 20(ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రంలో లక్షా15వేల మంది వితంతు పింఛన్లు ఈనెలలో మంజూరు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడుతెలిపారు.ఐదువేల కోట్లతో అన్నదాత సుఖీభవ, మూడువేల కోట్లతో మహిళలకు ఉచిత బస్సుసౌకర్యం కల్పిస్తామని చెప్పారు.ఆదివారం టెక్కలి పంచాయతీలోని అం జనాపురంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందుఇచ్చిన హామీమేరకు నిరుద్యోగభృతి, ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం వంటివి కూడా ప్రాధాన్యతాక్రమంలో అందజేస్తామన్నారు. అంజనాపు రంలో రూ.కోటి 95లక్షల ఉపాధి నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంజనాపురం సమీపంలో గల లేఅవుట్‌ను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఒక లబ్ధిదారునికి మూడుసెంట్లు స్థలం చొప్పున్న అర్హులైన వారిని గుర్తించి ఇళ్ల పట్టా లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి సూచించారు. తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓట్లు మాత్రం ఇతరులకు వేస్తున్నారన్నారు. ఈ సంద ర్భంగా అచ్చెన్నాయుడు బురదరోడ్లపై నడిచి ముందుకుసాగారు. కార్యక్రమంలో పిన కానఅజయ్‌కుమార్, ఎల్‌ఎల్‌నాయుడు, హనుమంతు రామకృష్ణ, లవకుమార్, కామేసు, సుందరమ్మ, ఆనంద్, రాము, షణ్ముఖరావు, దల్లి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ఉపకరణాలు
జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు రూ.3కోట్ల50లక్షలతో పలురకాల ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం టెక్కలి మండలపరిషత్ కార్యాలయంలో డివిజన్‌కు సంబంధించి రూ.73లక్షలతో 352మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ మోటరైజ్‌డ్ ట్రైసైకిల్, హియరింగ్ కిట్స్, ట్రైసైకిళ్లు, స్టిక్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు పేరుతో కొం దరు తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చి పింఛన్లు పొందుతున్నారని, క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్వహించి వాటిని తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో సీఈవో శ్రీధర్‌రాజా, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, బోయిన గోవిందరాజులు, ఎల్‌ఎల్‌నాయుడు, పినకాన అజయ్‌కుమార్, హనుమంతు రామకృష్ణ, లవకుమార్, కామేసు, దమయంతి, గండి సూర్యనారా యణరెడ్డి, దోని బుజ్జి, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 11:41 PM