Antarvedi : శోభాయమానం.. నారసింహుడి రథోత్సవం
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:24 AM
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది
అంతర్వేది, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): అంతర్వేది పురవీధుల్లో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం నిర్వహించారు. తొలుత ఆలయ ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్, చైర్మన్ మొగల్తూరు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ తొలిపూజ చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయం నుంచి స్వామి-అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి ఊరేగింపుగా స్వామివారి సోదరి అశ్వరూఢాంబిక (గుర్రాలక్కమ్మ) గుడికి తీసుకువచ్చారు. గోవింద, నరసింహ నామస్మరణలతో రథాన్ని భక్తులు లాగారు. భీష్మఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి అధికసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..
Updated Date - Feb 09 , 2025 | 04:24 AM