ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం

ABN, Publish Date - Mar 18 , 2025 | 12:08 AM

కక్షిదారులు తమ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది తెలిపారు.

ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది

కర్నూలు లీగల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులు తమ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది తెలిపారు. సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లాల న్యాయవాదులకు, ఎన్జీవోలకు నిర్వహించిన మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు అన్ని జిల్లా కోర్టులలో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశ పెట్టాలని ఆదేశించిందని, ఈ మేరకు సోమవారం నుంచి 21వ తేదీ వరకు ఈ అంశంపై 40 గంటల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించేందుకు కేరళ రాష్ట్రం నుంచి శిక్షకులు వచ్చినట్లు ఆయన తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన 89 కింద మధ్యవర్తిత్వానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 12:08 AM