స్పెషల్ సబ్ జైలు తనిఖీ
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:31 PM
నంద్యాల స్పెషల్ సబ్ జైలును కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి లీలా వెంకట శేషాద్రి బుధవారం తనిఖీ చేశారు.
ఖైదీల ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన న్యాయమూర్తి
నంద్యాల క్రైం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): నంద్యాల స్పెషల్ సబ్ జైలును కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి లీలా వెంకట శేషాద్రి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జైలు లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను తనిఖీ చేశారు. జైలులోని పలు విభాగాలను పరిశీలించారు. ఖైదీలకు ప్రిజన లీగల్ ఎయిడ్ క్ల్లీనిక్ గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్, ఒక పారాలీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయసలహాలు అందిస్తారని చెప్పారు. ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తిచేసుకోవాలని సూచించారు. న్యాయవాదులు లేని ఖైదీలకు ఉచితంగా నియమిస్తామని తెలిపారు. 70ఏళ్లు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడేవారికి బెయిల్ మంజూరయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గురుప్రసాద్‌రెడ్డి, జిల్లా జైళ్ల అధికారి నరసింహారెడ్డి, జైలు డాక్టర్ గురుకుమార్, లాయర్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:31 PM