ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:43 PM

గిరిజనుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌

పీఎం జుగా పథకానికి 518 మారుమూల గ్రామాల ఎంపిక

15 నుంచి 30వ తేదీ వరకు ఆయా పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిమ జాతి గిరిజనుల(పీవీటీజీ) అభివృద్ధికి కేంద్ర పీఎం జన్‌మన్‌ పథకం ప్రవేశ పెట్టినట్లుగానే, జిల్లాలోని మారుమూల గిరిజన పల్లెల్లో అభివృద్ధి, అక్కడ జనానికి సంక్షేమ పథకాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి దర్తీ అభా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్‌ (పీఎం జుగా) అనే మరో పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో మారుమూలన ఉన్న 518 గ్రామాలు పీఎం జుగా పథకానికి ఎంపికయ్యాయి. కేంద్ర, రాష్ట్ర పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాలను పొందేలా ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని పాడేరు డివిజన్‌లో 260 గ్రామాల్లో, రంపచోడవరం డివిజన్‌లో 211, చింతూరు డివిజన్‌లో 57 గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి అవగాహన, పథకాల వర్తింపునకు కార్యక్రమాలు చేపడతామన్నారు.

రూ.68.96 కోట్లతో 22 హాస్టళ్లు మంజూరు

మారుమూల గిరిజన పల్లెల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సదుపాయాలు కల్పించేందుకు జిల్లాకు 22 హాసళ్ల నిర్మాణానికి రూ.68.96 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్‌ తెలిపారు. వాటిలో 11 హాస్టళ్లు గిరిజన సంక్షేమశాఖ, మరో 11 హాస్టళ్లు సమగ్ర శిక్ష ద్వారా నిర్మాణం జరుగుతాయని, వాటి ద్వారా 84 గ్రామాల్లోని 3,863 గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, మార్కెటింగ్‌కు అనుకూలంగా ఉండేందుకు రూ.2 కోట్ల వ్యయంతో పాడేరు, మారేడుమిల్లి మండలాల్లో గిరిజన మల్టీపర్పస్‌ మార్కెటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో లక్షా 89 వేల 103 ఎకరాల అటవీ భూములను లక్షా 12 వేల 873 మంది గిరిజనులకు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో 25 వేల 145 మందికి హక్కు పత్రాలు పంపిణీ చేశామని, ఇంకా పాడేరు డివిజన్‌లో 2 వేల మందికి, రంపచోడవరం డివిజన్‌ 1,496 మందికి సంబంధించిన హక్కు పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు గానూ 1,550 మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి 30 వరకు జరిగే ప్రత్యేక గ్రామసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:43 PM