ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాలల కోసం ప్రత్యేక చట్టాలు

ABN, Publish Date - May 28 , 2025 | 11:28 PM

బాలల రక్షణ కోసం రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు.

శిక్షణా శిభిరంలో ప్రసంగిస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): బాలల రక్షణ కోసం రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అనాథ బాలల పరీరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించడానికి స్థానిక న్యాయ సేవాసదన భవనలో బుధవారం శిక్షణా శిబిరం జరిగింది. ఈ శిబిరానికి హాజరైన లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని కర్నూలు జిల్లా ఇనచార్జి ప్రధాన న్యాయాధికారి కమలాదేవి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అనాథ బాలలను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేయడమే లక్ష్యమన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒక సాధికారిత కమిటీని ఏర్పాటు చేస్తారనీ, ఈ కమిటీలో పలువురు సంబంధిత అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ వీది బాలలను గుర్తించి వారికి ఆధార్‌ కార్డులను ఇప్పించి ప్రభుత్వ పథకాలు వారికి లభించేలా చర్యలు తీసుకుంటారనీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎవరికైనా అనాథ బాలలు కనిపిస్తే టోల్‌ఫ్రి.నెంబర్‌.15100కు కాల్‌ చేస్తే వెంటనే వారికి న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచవో శాంతికళ, డీఆర్వో వెంకటరమణ, డిస్ర్టిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన ఆఫీసర్‌ శారద, ఐసీడీఎస్‌ నంద్యాల పీడీ లీలావతి, నంద్యాల డీఈవో జనార్దన రెడ్డి, కర్నూలు వనటౌన సీఐ రామయ్య నాయుడు, ప్యానెల్‌ న్యాయవాదులు బద్దల లక్ష్మినారాయణ, రాంపుల్లయ్య, పారా లీగల్‌ వాలంటీర్‌ రాయపాటి శ్రీనివాస్‌, సుధారాణి, గోపి, హేమంత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:02 PM