ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, Publish Date - Apr 29 , 2025 | 12:39 AM

ప్రజా సమస్యల పరిష్కారవేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలురకాలసమస్యలను విన్నవించారు. ప్రజలనుంచి వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మీకోసంలో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారవేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలురకాలసమస్యలను విన్నవించారు. ప్రజలనుంచి వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 268 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ, డీఆర్వో చిన ఓబులేషు, స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్లు పార్థసారఽథి, మాధూరి, విజయజ్యోతి తదితరులు ఉన్నారు.

ఒంగోలులోని పాలడెయిరీని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని అబ్బూరి శ్రీనివాసరావు, జాగర్లమూడి పూర్ణచంద్రరావులు కోరారు. డెయిరీ మూతపడటంతో పాడిపరిశ్రమ దెబ్బతిందన్నారు. అందువల్ల ఈ డెయిరీని పునరుద్ధరించి పాడిరైతులను ఆదుకోనే విధంగా చూడాలని కోరారు.

జిల్లాలోని ఉర్దూమీడియం పాఠశాలల్లో ఉర్దూ సెకండరీ గ్రేడ్‌ పోస్టులను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన్‌ నేతలు షేక్‌ అన్వర్‌బాషా, జీఎండీ వలీలు కోరారు. ఉర్దూమీడియం సెకండరీ గ్రేడ్‌ పోస్టులను సర్‌ప్లస్‌ జాబితా నుంచి తొలగించాలని కోరారు.

కోడలు వేధింపుల నుంచి రక్షించాలని గిద్దలూరుకు చెందిన హెచ్‌ లక్ష్మీదేవి కోరారు. కుమారుడు చనిపోయాడని, కోడలు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అనేక ఇబ్బందులు పెడుతూ ఇంట్లోకి కూడా రానివ్వడం లేదనిఫిర్యాదు చేశారు.

Updated Date - Apr 29 , 2025 | 12:39 AM