ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి జిల్లాలో క్రీడా స్టేడియం: స్పీకర్‌ అయ్యన్న

ABN, Publish Date - Mar 19 , 2025 | 04:31 AM

‘రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయాలి. క్రీడాకారులను ప్రోత్సహించాలి. అందుకు ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించాం’ అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

  • అట్టహాసంగా ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు

  • ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబడ్డీలో అచ్చెన్న, వాలీబాల్‌లో అయ్యన్న జట్ల గెలుపు

విజయవాడ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయాలి. క్రీడాకారులను ప్రోత్సహించాలి. అందుకు ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించాం’ అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రజాప్రతినిధు ల క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పోటీలను అయ్య న్న పాత్రుడు ప్రారంభించారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా క్రీడలు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎంతోమంది మంచి క్రీడాకారులున్నారు. క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించి క్రీడలకు పూర్వవైభవం తీసుకొస్తాం’ అని స్పీకర్‌ అన్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరిలోను క్రీడాస్ఫూర్తి ఉండాలి. ఇలాంటి క్రీడా పోటీల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనడం వల్ల నియోజకవర్గాల్లో క్రీడలను ప్రోత్సహించే అవకాశం వస్తుంది’ అన్నారు. ఈ పోటీల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ గాయపడ్డారు. మంత్రి రాంప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. జట్టులో ఉన్న విజయ్‌కుమార్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు బంతి కోసం పరిగెత్తుతూ పడిపోయారు. మొత్తం 6 జట్లు క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాయి. అందులో నాదెండ్ల మనోహర్‌, పల్లా శ్రీనివాస్‌, ఎం.రాంప్రసాద్‌రెడ్డి జట్లు గెలిచాయి. మహిళల టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలో గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత జట్లు తలపడగా... గుమ్మిడి జట్టు గెలిచింది. పురుషుల టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలో మొత్తం నాలుగు జట్లు తలపడ్డాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణరాజు జట్లు గెలుపొందాయి. కబడ్డిలో అయ్యన్న, అచ్చెన్న జట్లు పోటీపడగా... అచ్చెన్న జట్టు గెలిచింది. వాలీబాల్‌లో అయ్యన్న జట్టు, త్రోబాల్‌లో భూమా అఖిల ప్రియ జట్టు గెలిచాయి.


‘పే టూ ప్లే’ విధానం రద్దు: రాంప్రసాద్‌రె డ్డి

గత వైసీపీ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల్లో ‘పే టూ ప్లే’ విధానాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని రద్దు చేసి క్రీడా కారులకు ఉచితంగా క్రీడలు ఆడుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వివరించారు. మంగళవారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

Updated Date - Mar 19 , 2025 | 04:33 AM