ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Legislative Committees: ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయండి

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:46 AM

శాసనసభ కమిటీల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి, సభ్యుల హక్కుల పరిరక్షణకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షం లేకున్నా, సభ్యులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు.

శాసనసభ కమిటీలకు స్పీకర్‌ అయ్యన్న దిశానిర్దేశం

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): శాసనసభ కమిటీల ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి, సభ్యుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఐదు శాసనసభ కమిటీల అధ్యక్షులు, సభ్యులతో బుధవారం స్పీకర్‌ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం లేదన్న అలసత్వం కూడదని, సీఎం చంద్రబాబు సూచించినట్లు సభ్యులు తమ విధి నిర్వహణలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలని స్పీకర్‌ సూచించారు. డిప్యూటీ స్పీకర్‌, అర్జీల కమిటీ అధ్యక్షుడు రఘురామ కృష్ణంరాజు, విశేషాధికారాల కమిటీ అధ్యక్షుడు పితాని సత్యనారాయణ, ప్రభుత్వ హామీల కమిటీ అధ్యక్షుడు కామినేని శ్రీనివాస్‌, నైతిక విలువల కమిటీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్‌ కూడా సమావేశంలో మాట్లాడారు. కాగా, బడ్జెట్‌ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అసెంబ్లీ ఉద్యోగులను శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు అభినందించారు. బుధవారం అసెంబ్లీ ఉద్యోగులతో వీరు సమావేశమయ్యారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:46 AM