ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా చిరువ్యాపారుల క్షీరాభిషేకం

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:37 PM

స్థానిక రాయల్‌ సర్కిల్‌లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ కు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యాపరాల చిన్న ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారులు క్షీరాభిషేకం చేశా రు.

ఎమ్మెల్యే ప్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న చిరు వ్యాపారులు

మైదుకూరు రూరల్‌ ,మార్చి17(ఆంధ్ర జ్యోతి) :స్థానిక రాయల్‌ సర్కిల్‌లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ కు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యాపరాల చిన్న ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారులు క్షీరాభిషేకం చేశా రు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని దినసరి మార్కెట్‌ వేలం పాటలో తోపుడుబండ్లకు మినహాయింపు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆమేరకు ఇటీవల జరిగిన మార్కెట్‌ వేలం పాటలో ఆదేశాలు జారీ చేశారు.మార్చి 1వ తేదీ నుంచి తోపుడుబండ్లకు గేటు రుసుము ఎవ్వరు చెల్లించాల్సిన పనిలేదని అధికారులు కూడా ప్రకటనలు చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన చిరువ్యాపారులు ఎమ్మెల్యే ప్లెక్సీకి క్షీరాభిషేకం చేయడంతో పాటు కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, బురగోళ్ల చిన్న, తుపాకుల రమణ, సారధి, రామిశెట్టి కిర ణ్‌, బెల్లం బుజ్జి, చిరువ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:37 PM