Raj Kasireddy custody: రాజ్ కసిరెడ్డిని మరోసారి కస్టడీకి ఇవ్వండి
ABN, Publish Date - May 22 , 2025 | 06:18 AM
మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని మరలా మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో కోరారు. ఆలోచనాత్మక విచారణ గురువారం వాయిదా పడింది, అలాగే ఇతర అరెస్టైన అధికారులపై విచారణలు కూడా వాయిదా వేసారు.
ఏసీబీ కోర్టులో సిట్ పోలీసుల పిటిషన్.. విచారణ నేటికి వాయిదా
విజయవాడ, మే 21(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్ కసిరెడ్డి)ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని సిట్ పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వారం రోజులపాటు రాజ్ కసిరెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించారు. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో కేసులో పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలను రాబట్టేందుకు సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయన్ను మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. పిటిషన్‌పై విచారణను న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారానికి వాయిదా వేశారు. ఇక ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కూడా గురువారానికి వాయిదా పడింది. అలాగే, ఈ కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్ బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 06:18 AM