ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: శ్రీవారి ఆలయం పోటులో సీబీఐ ఫోరెన్సిక్‌ బృందం తనిఖీలు

ABN, Publish Date - May 21 , 2025 | 03:54 AM

శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్‌ దర్యాప్తు వేగంగా సాగుతోంది. సీబీఐ ఫోరెన్సిక్‌ టీం తిరుమలలోని ప్రసాద తయారీ కేంద్రాలను సందర్శించి, కార్మికులతో విచారణ జరిపింది.

తిరుమల, మే 20(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్‌ విచారణ వేగంగా సాగుతోంది. సీబీఐ ఫోరెన్సిక్‌ విభాగం అధికారులు నలుగురు మంగళవారం తిరుమల చేరుకుని ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఆలయంలో లడ్డూ, అన్నప్రసాదాల తయారీ పోటును పరిశీలించారు. పోటు కార్మికులతో మాట్లాడారు. లడ్డూ, అన్నప్రసాదాల తయారీని అడిగి తెలుసుకున్నారు. వారు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, సీనియర్లు ఎంతమంది ఉన్నారు వంటి విషయాలనూ తెలుసుకున్నారు. ముఖ్యమైన వాటిని వీడియో తీశారు. బూందీ తయారీ కేందాన్ని కూడా సందర్శించి అక్కడి పోటు కార్మికులతోనూ మాట్లాడారు. అనంతరం తిరుపతిలోని సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 03:54 AM