ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP JAC: సింగిల్‌ మేజర్‌తో విద్యార్థులకు నష్టం

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:42 AM

సింగిల్‌ మేజర్‌ డిగ్రీ విధానంతో విద్యార్థులకు చాయిస్‌ తగ్గుతుందని, ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల జేఏసీ అభిప్రాయపడింది.

  • డిగ్రీ అధ్యాపకుల జేఏసీ

అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సింగిల్‌ మేజర్‌ డిగ్రీ విధానంతో విద్యార్థులకు చాయిస్‌ తగ్గుతుందని, ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల జేఏసీ అభిప్రాయపడింది. సింగిల్‌ మేజర్‌తో కాలేజీల్లో అందుబాటులో ఉన్న కోర్సులకే విద్యార్థులు పరిమితం కావాల్సి వస్తోందని తెలిపింది. పైగా భవిష్యత్తులో గణితం, భౌతిక శాస్త్రం, భాషా సబ్జెక్టుల్లో అధ్యాపకులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఉన్నత విద్యామండలి ప్రతిపాదించినట్లుగా డ్యూయెల్‌ మేజర్‌ డిగ్రీని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ.. జేఏసీ ప్రతినిధులు రాఘవరెడ్డి, పి.గోపాలనాయుడు, ఎం.శ్యాంబాబు, ఎం.శ్రీనివాసరెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించి డ్యూయెల్‌ మేజర్‌ అమలుచేయాలని కోరారు. అలాగే అధ్యాపకులకు బదిలీలు చేపట్టాలని, విద్యారంగం నిర్ణయాల్లో విద్యావేత్తలు, విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 07 , 2025 | 02:43 AM