రాష్ట్రంలోనూ కులగణన చేపట్టాలి: షర్మిల
ABN, Publish Date - Feb 05 , 2025 | 04:58 AM
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే దిక్సూచి అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
అమరావతి/మడకశిర,, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే దిక్సూచి అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. రాహుల్‌గాంధీ దూరదృష్టికి తెలంగాణ సర్కారు చేపట్టి కులగణన ప్రత్యేక నిదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ కులగణన చేపట్టాలని సీఎం చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు అమలుచేయాలన్నారు.
కేంద్ర, రాష్ట్రాల్లోనూ చేయాలి: రఘువీరా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేతోపాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మకమని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా జనగణనతోపాటు కులగణన చేపట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 04:58 AM