ఆదిత్య శేషారెడ్డికి కార్ల్ ల్యాండ్ స్టీనర్ అవార్డు
ABN, Publish Date - Jun 16 , 2025 | 04:20 AM
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సర్వీసుల్లో అత్యధిక సేవలను అందించిన వారికి గుంటూరులోని భారతీయ విద్యాభవన్‌లో అవార్డుల ను ఆదివారం ప్రదానం చేశారు.
కాకినాడ రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సర్వీసుల్లో అత్యధిక సేవలను అందించిన వారికి గుంటూరులోని భారతీయ విద్యాభవన్‌లో అవార్డుల ను ఆదివారం ప్రదానం చేశారు. తలసీ మియా రోగుల కోసం 2023, 24 సంవత్సరాల్లో ఏపీలో అత్యధికంగా ఒకే విద్యా సంస్థ నుంచి ఆదిత్య డిగ్రీ కళాశాలలు అత్యధిక స్థాయిలో రక్త యూనిట్లు అందజేశాయి. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.శేషారెడ్డికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతిష్ఠాత్మకమైన ‘కార్ల్ ల్యాండ్ స్టీనర్’ అవార్డును రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ అందజేశారు.
Updated Date - Jun 16 , 2025 | 04:22 AM