ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Political Intimidation: అమ్మో.. ఆ ఎమ్మెల్యే దందాలతో దడ

ABN, Publish Date - Aug 03 , 2025 | 04:05 AM

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేశారా, అయితే... మాకు కొంత వాటా ఇవ్వాలి. లేదా.. ఎకరాకు రూ.10 లక్షలు కప్పం కట్టాల్సిందే లేదంటే... పర్మిషన్లు రావు. రిజిస్ట్రేషన్లు కావు... వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది చేసిన దందా ఇది.

  • రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్‌ నేత

  • వైసీపీ పాలనను గుర్తుచేస్తున్న వైనం

  • అనుచరులతో కలిసి వసూళ్ల పర్వం

  • దళారులను అడ్డుపెట్టి బెదిరింపులు

  • వెంచర్‌ వేస్తే వాటాలు డిమాండ్‌

  • లేదా ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలి

  • కాదూకూడదంటే అనుమతులు రావు

  • ఏడాదిగా ల్యాండ్‌ కన్వర్షన్‌ అనుమతులకు చెక్‌

  • రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ అధికారులకూ బెదిరింపులు

  • సొంత పార్టీ ఎమ్మెల్యేకుసైతం తప్పని తిప్పలు

ఆయనో సీనియర్‌ ఎమ్మెల్యే! పలుమార్లు శాసనసభ్యుడయ్యారు. చూడటానికి సున్నితంగా కనిపిస్తారు! అంతకుముందు పెద్దగా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలూ లేవు! ఇప్పుడు ఏమైందో ఏమో... మనిషి మొత్తంగా మారిపోయారు! మంత్రి పదవి రాలేదనే ఆక్రోశమో... ‘నేను మాత్రం ఎందుకు వెనుకబడాలి’ అనే ఆలోచనో తెలియదుగానీ వైసీపీ నేతల తరహా దందాలకు తెరలేపారు. తన కుటుంబ వ్యాపారాల్లో వస్తున్న ఆదాయానికి... అవినీతి సొమ్మును పాలూ నీళ్లలా జత చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో... రాజధానిని ఆనుకుని ఉన్న తన నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంలా మార్చుకున్నారు.

(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

‘రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేశారా? అయితే... మాకు కొంత వాటా ఇవ్వాలి. లేదా.. ఎకరాకు రూ.10 లక్షలు కప్పం కట్టాల్సిందే! లేదంటే... పర్మిషన్లు రావు. రిజిస్ట్రేషన్లు కావు’... వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది చేసిన దందా ఇది! ఆ ప్రభుత్వం పోయింది! కానీ... ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు ఇదే దందాకు తెరలేపారు. రాజధానికి సమీపంలోని సొంత నియోజకవర్గంలో ఆయనే రాజు.. ఆయనే మంత్రి. ఎమ్మెల్యేకు తెలియకుండా అక్కడ చీమ చిటుక్కుమనటానికి కూడా వీల్లేదు. ఆయన అనుచరులు చేస్తున్న అడ్డగోలు దందా చూసి ఆ ప్రాంతానికి వెళ్లటానికి వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వ్యవహారంలో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు చేస్తున్న అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. ఈ విషయంలో సొంత పార్టీకి చెందిన వారిని కూడా వదిలిపెట్టడం లేదు. సదరు ఎమ్మెల్యే ముడుపుల దందాతో ఆ నియోజకవర్గంలో భయానక వాతావరణం నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి.

సగం వాటా ఇవ్వాల్సిందే..

సీనియర్‌ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా గత ఏడాదిగా చేస్తున్న ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. కోట్లు పెట్టుబడులు పెట్టి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల కోసం భూములు కొనేవారిని వేధిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం రాజధానికి సమీపంలో ఉండటంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చాలా భూములు కొనుగోలు చేశారు. ఎకరం రూ.కోట్లలోనే పలుకుతోంది. వ్యవసాయ భూమిలో వెంచర్‌ వేయడానికి రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. ల్యాండ్‌ కన్వర్షన్‌ జరిగితే తప్ప ప్లాట్‌లు వేసి విక్రయించే అవకాశం ఉండదు. దీని కోసం భూమి కొనుగోలు చేసిన వ్యాపారులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటారు. ముడుపుల వసూలుకుఎమ్మెల్యే దీన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. తనకు తెలియకుండా అనుమతులు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు.. ‘మీరు వెళ్లి సార్‌ను కలిసి రండి’ అని వ్యాపారులకు సలహాలు ఇస్తున్నారు. దీంతో వారు ఆయన దర్శనం కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. చివరకు సార్‌ను కలిసిన తర్వాత ఆయన మాటలు విని రియల్‌ వ్యాపారులు బిత్తరపోతున్నారు. ‘ఆ భూమి మా వాడికి నచ్చింది. మీ కంటే ముందు మా వాడు కొనాలని అనుకున్నాడు. కానీ మీరు కొనేశారు. ఇప్పటికైనా ఏమీ మునిగి పోలా.. మా వాడికి వాటా ఇవ్వండి’ అని బెదిరిస్తున్నారు.

ఊ.. అనకపోతే ఉహూనే...

సీనియర్‌ ఎమ్మెల్యే చెప్పినట్లు వినకపోతే వ్యాపారులకు తిప్పలు తప్పవు. వాటాలు ఇవ్వబోమన్నందుకు గత ఏడాదిగా ఎన్నో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు అనుమతులు రాకుండా ఆయన అడ్డుపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరైతే అనుమతులు ఆలస్యమైతే నష్టపోతామనే భయంతో.. అనుచరులు అడిగినంత ఇచ్చుకోలేమని నేరుగా ఆయన్నే కలిసి సెటిల్‌ చేసుకున్నారు. ఇస్తే వాటాలు ఇవ్వాలి.. లేకపోతే ఎకరాకు రూ.10 లక్షలకు తక్కువ లేకుండా ముడుపులు ముట్టజెప్పాలని డిమాండ్‌ చేస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. కొందరు దళారులను రంగంలోకి దించి సీనియర్‌ ఎమ్మెల్యే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రిజిస్ట్రేషన్‌ చేశావా.. పోతావ్‌!

ఇప్పటి వరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల భూములకు అనుమతి రాకుండా రెవెన్యూ అధికారులను అదుపు చేసిన సీనియర్‌ ఎమ్మెల్యే ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. తన అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్‌ చేయరాదని, వేలం పాట నిర్వహించరాదని రిజిస్ట్రేషన్లు, బ్యాంకు అధికారులను కూడా బెదిరిస్తున్నారు. ‘నాకు తెలియకుండా వెంచర్లలోని ప్లాట్లు, ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరే భూములు రిజిస్ర్టేషన్‌ చే స్తే నీ పోస్టింగ్‌ ఊస్టింగ్‌’ అంటూ కీలక ప్రాంతానికి చెందిన రిజిస్ర్టార్‌ను బెదిరించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు రావడంతో సదరు రిజిస్ర్టార్‌ సీట్లో కూర్చోవాలన్నా బేంబేలెత్తుతున్నారు. ఇదే నియోజకవర్గంలోని ఒక గ్రామానికి చెందిన అర ఎకరం భూమిని బ్యాంకు వేలం వేసింది. ఆ భూమిని ఆన్‌లైన్‌లో ఒకరు పాడుకొని దక్కించుకున్నారు. తనకు తెలియకుండా ఆ భూమిని ఎలా పాట పాడుకుంటారని ప్రశ్నించిన సదరు ఎమ్మెల్యే.. రిజిరేస్టషన్‌ విషయంలో సినిమా చూపించారు. బ్యాంకు అధికారులు రిజిరేస్టషన్‌కు సిద్ధమైనా సబ్‌ రిజిస్ర్టార్‌కు చెప్పి ఆపించారు. తన నియోజకవర్గంలో ఎటువంటి వేలం పాట అయినా తనకు తెలియకుండా చేస్తే బాగుండదని చివరికి బ్యాంకు అధికారులనూ బెదిరించినట్లు తెలుస్తోంది.

తోటి ఎమ్మెల్యేకూ తిప్పలు

ఆ ఎమ్మెల్యే భూదందాలో ఒక ఎమ్మెల్యే కూడా బాధితురాలే అని తెలుస్తున్నది. తన భర్త రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలో ఆమె ఒక డైరెక్టర్‌. వారికి సంబంధించిన వెంచర్‌ అనుమతు లు అడ్డుకుంటూ ఏడాదిగా సీనియర్‌ ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. అడిగినంత ఇవ్వకపోతే అంతే అని చెప్పినట్టు సమాచారం. పలుమార్లు ఎమ్మెల్యే భర్త మాట్లాడినా సీనియర్‌ ఎమ్మెల్యే మెత్త పడలేదని సమాచారం. అదేమని అడిగితే.. ఆ భూమిని తన అనుచరుడు ముందుగా కొనాలని అనుకున్నాడని, ఆ భూమిని మీరు కొన్నందున ఆ వెంచర్‌లో అతనికి కూడా వాటా ఇవ్వాలని షరతు పెట్టినట్టు తెలిసింది. ఆఖరికి ఆ ఎమ్మెల్యే భర్త గత్యంతరం లేక పది శాతం వాటా ఇస్తానని చెప్పినా సంతృప్తి చెందలేదని సమాచారం. సీనియర్‌ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ఆగడాలు భరించలేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అమీ తుమీ తేల్చుకోవటానికి సిద్ధపడినట్లు తెలిసింది. గత ఏడాదిగా భూముల అనుమతుల కోసం వేచి చూసి విసుగుచెందిన వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Updated Date - Aug 03 , 2025 | 04:10 AM