ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sand Mafia: సెలవు రోజు గుట్టుగా..

ABN, Publish Date - Jun 30 , 2025 | 01:16 AM

ఆదివారం అధికారులకు సెలవు అయితే మాకు మాత్రం పండగ అన్నట్టుగా బుసక మాఫియా తయారయింది. దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంకలో శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు బుసక తవ్వకాలు జరిగాయి. బుసక తవ్వకాలు పూర్తి కావటంతో పక్కనే కళ్లంవారిపాలెంలో ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు.

Sand Mafia
  • బుసక మాఫియా బరితెగింపు

  • శనివారం రాత్రి నుంచి బుసక, ఇసుక తవ్వకాలు

  • పట్టించుకోని అధికారులు..

  • విమర్శలు వ్యక్తం చేస్తున్న స్థానికులు

తోట్లవల్లూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆదివారం అధికారులకు సెలవు అయితే మాకు మాత్రం పండగ అన్నట్టుగా బుసక మాఫియా తయారయింది. దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంకలో శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు బుసక తవ్వకాలు జరిగాయి. బుసక తవ్వకాలు పూర్తి కావటంతో పక్కనే కళ్లంవారిపాలెంలో ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా వెళ్లగా పొట్టిదిబ్బలంకలో రహదారి పక్కన ఎలాంటి అనుమతులు లేని పొలంలో బుసక తవ్వకాలు కనిపించాయి. పొలంలో ఒక లారీ బుసక లోడింగ్‌ కోసం ఉంది. మరోవైపు కళ్లంవారిపాలెం పాయలో ఎక్స్‌కవేటర్‌తో మరో లారీలోకి ఇసుక లోడింగ్‌ జరుగుతు ఉంది. మీడియాను చూసి ఇసుక లోడింగ్‌ ఆపి బుసక లోడింగ్‌ను చేపట్టారు. వీఆర్వో నాగేశ్వరరావుకి సమాచారం ఇవ్వగా వీఆర్‌ఏను పంపిస్తాను అని చెప్పారు. కానీ ఐదు గంటల వరకు వీఆర్‌ఏ రాలేదు. బుసక లోడింగ్‌ లారీని బయటకు పంపించి ఎక్స్‌కవేటర్‌ను రెల్లిదుబ్బుల్లో పెట్టారు.

నాడు చర్యలు తీసుకోకుండా వదిలేశారు..

మే 15వ తేదీన పొట్టిదిబ్బలంకలో బుసక తవ్వకాలు చేపట్టాగా ‘ఆంధ్రజ్యోతి’ బుసక మాఫియాపై కథనం ప్రచురించింది. అదేరోజు వీఆర్వో నాగేశ్వరరావు వచ్చి మీడియా ఎదుటే బుసక లారీలను పట్టుకున్నారు. ఆ తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గి ఆ బుసక లారీలను ఎలాంటి జరిమానా లేకుండా విడిచి పెట్టారు. అప్పటి నుంచి నిలిపిన బుసక తవ్వకాలను శనివారం రాత్రి చేపట్టి ఆదివారం మధ్యాహ్నానికి పూర్తి చేసేశారు. ఇదంతా అధికారుల మొతక తనంతోనే జరిగినట్టు తెలుస్తోంది. మేలో జరిపిన బుసక తవ్వకాల వైపు ఒక్క అధికారి కూడా పరిశీలించకుండా చర్యలు లేకుండా ఉదాసీనంగా వ్యవహరించటంతో ఇపుడు అదే పొలంలో బుసక తవ్వకాలు జరపటానికి మాఫియాకు అలుసు దొరికింది. అధికారులు, మాఫియా కుమ్మక్కు చర్యల్లో భాగంగానే ఇలా బరితెగింపునకు సాహసిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు సైతం మాఫియాపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవటం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Jun 30 , 2025 | 11:48 AM