ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాల స్థలం కబ్జా!

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:37 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని చిలకలపూడి ప్రధాన కూడలిలో కోట్ల రూపాయల విలువ చేసే 40 సెంట్ల ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. స్థలం చుట్టూ రెండు రోజులుగా ప్రహారీ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాలని జనసేన నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

- చిలకలపూడి సెంటరులో 40 సెంట్లు ఆక్రమణ

- చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టిన అక్రమార్కులు

- స్థలం విలువ ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు

- ఆక్రమణపై అధికారులకు జనసేన నాయకుల ఫిర్యాదు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని చిలకలపూడి ప్రధాన కూడలిలో కోట్ల రూపాయల విలువ చేసే 40 సెంట్ల ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. స్థలం చుట్టూ రెండు రోజులుగా ప్రహారీ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాలని జనసేన నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

చిలకలపూడి సెంటరులోని 40 సెంట్లు స్థలంలో ఆనంద్‌ అనే వ్యక్తి ఏహెచ్‌ ఎయిడెడ్‌ పాఠశాలను 1975లో ప్రారంభించారు. గత 15 సంవత్సరాల వరకు ఈ పాఠశాలలో తరగతులు నిర్వహించారు. పాఠశాలను నడిపిన ఆనంద్‌, హెచ్‌ఎంగా పనిచేసిన ఆయన భార్య మరణించారు. వీరికి సంతానం లేకపోవడంతో వీరి మరణం అనంతరం పాఠశాల మూతపడింది. అప్పటి నుంచి ఈ పాఠశాల స్థలం ఖాళీగానే ఉంటోంది. ఇటీవల కాలంలో కొందరు ఈ స్థలం కొనుగోలు చేసినట్లుగా చూపి, ముగ్గురి నుంచి నలుగురు చేతులు మారినట్లుగా రికార్డులు సృష్టించి, రిజిస్ర్టార్‌ కార్యాలయంలో దొంగ రిజిస్ర్టేషన్‌ కూడా చేయించినట్టు సమాచారం. ఇటీవల కాలంలో అక్కడున్న చికెన్‌ షాపును, ఇతరత్రా చిన్నపాటి వ్యాపారులను ఖాళీ చేయించారు.

పాఠశాల స్థలంగానే రెవెన్యూ రికార్డుల్లో

50 ఏళ్ల క్రితం వరకు చిలకలపూడి, సర్కారుతోట ప్రాంతాలు రిజర్వు ఫారెస్ట్‌ భూములుగా ఉండేవి. ఈ రెండు ప్రాంతాల్లో వేలాది మంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండటంతో భవిష్యత్తులో వారికి ఇళ్లస్థలాల విషయంలో ఇబ్బందులు రాకుండా అప్పట్లో నివాసం ఉంటున్న వారి నుంచి చదరపు గజం భూమికి ఒక రూపాయి చొప్పున నగదు కట్టించుకుని ఇళ్లస్థలాలుగా అప్పటి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే ఈ రెండు ప్రాంతాల్లోని భూములు 22-ఎలో ఉండిపోవడంతో క్రయవిక్రయాల సమయంలో రిజిస్ర్టేషన్‌లు జరిగేవి కావు. దీనిపై స్థానికులు అఽధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు. స్పందించిన అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఈ రెండు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలను 22-ఎలో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా సర్కారుతోట, చిలకలపూడి ప్రాంతాలను 22-ఎ నుంచి తొలగిస్తున్నట్లు రూపొందించిన ఉత్తర్వులను స్థానిక ప్రజలకు అందజేశారు. 22-ఎ నుంచి భూములను తొలగించేందుకుగాను మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు సర్వే చేసిన సమయంలో సర్వే నెంబరు 357, సబ్‌డివిజన్‌ నెంబరు 20లో పాఠశాల స్థలం 40 సెంట్లు ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. పాఠశాల స్థలంపై కన్నేసిన నలుగురు వ్యక్తులు ఈ భూమిని తాము కొనుగోలు చేశామని, తమ పేరున రిజిస్ర్టేషన్‌లు కూడా జరిగాయని చెబుతూ ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా ఈ స్థలం సర్వే చేయాలని మునిసిపల్‌ అధికారులపై స్థానిక పెద్దల ద్వారా తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అక్రమార్కులకు ఒక మంత్రి పీఏ పూర్తిస్థాయి అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు లేక పోలేదు. పాఠశాల స్థలానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించిన జనసేన నాయకులు పాఠశాల స్థలం చుట్టూ చేస్తున్న ప్రహరీ నిర్మాణ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు చూస్తాం.. చేస్తాం అంటుండటంతో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం : కమిషనర్‌, తహసీల్దార్‌

చిలకలపూడి సెంటరులోని పాఠశాల స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బాపిరాజు, నార్త్‌ తహసీల్దార్‌ నాగభూషణం తెలిపారు. ఈ స్థలం వద్దకు సిబ్బందిని పంపి పూర్తిస్థాయి వివరాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:37 AM