పాఠశాల కరస్పాండెంట్లు ఐకమత్యంగా ఉండాలి
ABN, Publish Date - Mar 23 , 2025 | 11:48 PM
పాఠశాలల కరస్పాండెంట్లు ఐక్యమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ ప్రైవేటు పాఠశాలల యజమాన్యం సంఘం (ఆపుస్మా) రాష్ట్ర గౌరవసలహాదారుడు జి.పుల్లయ్య తెలిపారు.
ఆపుస్మా రాష్ట్ర సలహాదారుడు జి.పుల్లయ్య
కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల కరస్పాండెంట్లు ఐక్యమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ ప్రైవేటు పాఠశాలల యజమాన్యం సంఘం (ఆపుస్మా) రాష్ట్ర గౌరవసలహాదారుడు జి.పుల్లయ్య తెలిపారు. ఆదివారం స్థానిక సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెప్ పాఠశాలలో ఏపీ ప్రైవేటు పాఠశాలల యజమాన్యల సంఘం జిల్లా జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జనార్దన రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. జి.పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల కరస్పాండెంట్లు ప్రావిడెంట్ ఫండ్లు, ఈఎ్‌సఐలను రెగ్యులర్‌గా చెల్లించాలని తెలిపారు. అలాగే పాఠశాలల యువ కరస్పాండెంట్లు, సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రైవేటు పాఠశాలల యజమాన్యాల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్.శ్రీనివాసరెడ్డి, సంఘం జిల్లా గౌరవసలహాదారుడు పీబీవీ సుబ్బయ్య, మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ రాజశేఖర్, యు.నటరాజ్, కర్నూలు నగరం అధ్యక్షులు యుగంధర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Updated Date - Mar 23 , 2025 | 11:48 PM