ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జలాధివాసంలో సంగమేశ్వరుడు

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:33 PM

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరిగి, బ్యాక్‌వాటర్‌ ప్రదేశంలో వెలసిన సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని ముంచెత్తింది.

సంగమేశ్వరాలయాన్ని ముంచెత్తిన వరదజలాలు

- క్షేతాన్ని ముంచెత్తుతున్న వరద జలాలు

- చివరి రోజు క్షేత్రంలో అంత్యపూజలు

ఆత్మకూరు/కొత్తపల్లి, జూన 15(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరిగి, బ్యాక్‌వాటర్‌ ప్రదేశంలో వెలసిన సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని ముంచెత్తింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 6.30 గంటల సమయానికి వరదజలాలు గర్భాలయంలోకి ప్రవేశించి వేపదారు శివలింగాన్ని సృశించాయి. ఆ తర్వాత నెమ్మదిగా నీటిమట్టం పెరగడంతో గర్భాలయంలోని సంగమేశ్వరుడు పూర్తిగా జలాధివాసమయ్యారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయానికి జూరాల నుంచి 15,808 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 6660 క్యూసెక్కుల చొప్పున మొత్తం 22,468 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరుతోంది. దీంతో డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను.. 840.40 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే గరిష్ఠ నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను 62.4320 టీఎంసీల నీటినిల్వలు వున్నాయి.

86 రోజులపాటు పూజలందుకున్న సంగమేశ్వరుడు :

శ్రీశైలానికి గత ఏడాది జూలై 23వ తేదిన వరద వచ్చిచేరడంతో సంగమేశ్వరుడు జలాధివాసం అయ్యారు. ఆ తర్వాత 242 రోజుల పాటు నదీగర్భంలో ఒదిగిన సంగమేశ్వరుడు ఈ ఏడాది మార్చి 22వ తేదీన పూర్తిగా బయల్పడి తిరిగి పూజలందుకున్నారు. అప్పటి నుంచి 86 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న సంగమేశ్వరుడు మళ్లీ జలాఽధివాసమయ్యాడు. కాగా శ్రీశైలం జలాశయం వెనకతట్టు జలాల్లో 1981లో జలాధివాసమైన సంగమేశ్వరుడు సుమారు 22ఏళ్ల పాటు నదీగర్భంలోనే ఉండి ఆ తర్వాత 2003లో తొలిసారిగా నదీజలాల నుంచి బయల్పడ్డాడు. అయితే సంగమేశ్వర క్షేత్ర చరిత్రలో 86రోజుల వ్యవధిలోనే సంగమేశ్వరుడు జలాధివాసం కావడం అదే ప్రథమంగా చెప్పవచ్చు.

చివరి రోజు సంగమేశ్వరుడికి అంత్యపూజలు :

సంగమేశ్వర క్షేత్రంలోని లలితా సంగమేశ్వర స్వామి, అమ్మవార్లు జలాధివాసం కానుండటంతో చివరి రోజైన ఆదివారం ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ అంత్యపూజలు నిర్వహించారు. ముందుగా వేపదారు శివలింగానికి రుద్రభిషేకం గావించి ప్రత్యేక పూజలు చేపట్టారు. తదుపరి స్వామివారికి జలాధివాస జయమంగళహారతిని నివేదించారు. సంగమేశ్వరాలయం జలాధివాసమయ్యే అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

Updated Date - Jun 15 , 2025 | 11:33 PM