ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సిపాయి తల్లులకు సెల్యూట్‌

ABN, Publish Date - May 11 , 2025 | 12:12 AM

దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో పోరాటం చేస్తున్న సైనికుల తల్లిదండ్రులకు కోడుమూరు పోలీసులు సెల్యూట్‌ చేశారు.

సిపాయి తల్లి కాళ్లను కడుగుతున్న సీఐ తబ్రేజ్‌

జవాన్‌ తల్లి పాదాలు కడిగిన సీఐ, ఎస్‌ఐ

కోడుమూరు, మే 10(ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో పోరాటం చేస్తున్న సైనికుల తల్లిదండ్రులకు కోడుమూరు పోలీసులు సెల్యూట్‌ చేశారు. కోడుమూరుకు చెందిన సునీల్‌బాబు, వినోద్‌ ఇద్దరు జవాన్లు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ యుద్ధంలో భాగంగా శత్రుదేశం పాకిస్తాన్‌తో పోరాటం చేస్తున్నారు. అలాగే మరో జవాన్‌ సునీల్‌ సెలవులను రద్దు చేసుకుని యుద్దభూమిలో పోరాటానికై సరిహద్దు ప్రాంతానికి తిరిగి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శనివారం జవాన్ల తల్లిదండ్రులకు సన్మానం చేశారు. ఇంతటితో ఆగని సీఐ తబ్రేజ్‌, ఎస్‌ఐ ఎర్రిస్వామి ముగ్గురు సిపాయిల మాతృమూర్తులు ఆదిలక్ష్మి, నాగమణి, లక్ష్మిదేవి పాదాలను కడిగి పాదసేవ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారతదేశం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్తాన్‌పై యుద్ధం ప్రారంభించింది. ఇందులో త్రివిదళాల పని చేసే జవాన్లు ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్‌ చేసి పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. యుద్ధంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాన మురళీనాయక్‌ వీర మరణం పొందారని అన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:12 AM