పుష్కరిణికి రూ.2.80 కోట్ల విరాళం
ABN, Publish Date - May 21 , 2025 | 11:29 PM
రాఘవేంద్రస్వామి మఠానికి కర్ణాటక లోని ఉడిపి చెందిన ప్రకాష్ శెట్టి అనే భక్తుడు రూ.2.80 కోట్లు పుష్కరిణి పనులకు విరాళంగా ఇచ్చారు.
స్థపతితో నిర్మాణ పనుల పరిశీలన
త్వరలో అందుబాటులోకి పుష్కరిణి
మంత్రాలయం, మే 21(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠానికి కర్ణాటక లోని ఉడిపి చెందిన ప్రకాష్ శెట్టి అనే భక్తుడు రూ.2.80 కోట్లు పుష్కరిణి పనులకు విరాళంగా ఇచ్చారు. బృందావన గార్డెన, సర్వజ్ఞ మందిరం స్థలంలో పుష్కరిణి పనులకు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. 160 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పు, 7.5 అడుగుల లోతుతో పుష్కరిణి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు సురేష్ కోనపూర్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి, స్థపతి తిరుమల స్తంభి, ప్రముఖ చిత్రకారుడు నటరాజన గణేష్ తో పుష్కరిణి పనులు పరిశీలించారు. త్వరలో పుష్కరిణి పనులు పూర్తి చేసి తుంగభద్ర నది నుంచి పుష్కరిణిలో నీటిని నింపి భక్తులకు అందు బాటులోకి తీసుకురానున్నారు. పూజలు చేసేందుకు అనుకూలంగా మెట్లు, రూపకల్పన, సరిహద్దులు, ప్రహరీ కంచను ఏర్పాట చేయాలని పీఠాధి పతి అధికారులను ఆదేశించారు. ఈ పుష్కరిణి నిర్మాణానికి విరాళం ఇచ్చి న దాత ప్రకాష్‌శెట్టిని పీఠాధిపతి అభినందించారు. కార్యక్రమంలో మఠం ఏఈ బద్రినాథ్, శ్రీహరి, సూపరింటెండెంట్ అనంతపురాణిక్, ద్వారపాలక అనంతస్వామి, శ్రీహరి కాంట్రక్టరు ఓబులయ్య, సైట్ ఇంజనీర్ ఉబ్బ శ్రీనివాసులు, సూపర్‌వైజర్ హనుమంతు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 11:29 PM