ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

R and B Department: రోడ్లు.. వంతెనలు ధ్వంసం

ABN, Publish Date - Oct 10 , 2025 | 06:08 AM

రాష్ట్రంలోని రహదారులు, వంతెనలు భారీగా దెబ్బతిన్నాయి. ఒకవైపు పాడైన రోడ్లకు ప్రభుత్వం మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తోంది. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలు..

  • 31 వేల కి.మీ. పరిధిలో పాడైన రహదారులు

  • రాష్ట్రవ్యాప్తంగా 3,338 వంతెనలు ధ్వంసం

  • తాజా పరిస్థితిపై మంత్రి జనార్దన్‌రెడ్డి సమీక్ష

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రహదారులు, వంతెనలు భారీగా దెబ్బతిన్నాయి. ఒకవైపు పాడైన రోడ్లకు ప్రభుత్వం మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తోంది. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 31వేల కి.మీ. పరిధిలో రహదారులు దెబ్బతిన్నాయి. ఇక వంతెనల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 3,338 వంతెనలు ధ్వంసమైతే వాటిలో 828 మరమ్మతులకు కూడా పనికిరానంతగా పాడయ్యాయి. వీటిని పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని ఆర్‌అండ్‌బీ విభాగం నివేదించింది. రహదారుల పరిస్థితిపై ఇక్కడి ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి గురువారం సమీక్షించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మరమ్మతు పనులపై అధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రధాన రహదారులు 24,117 కి.మీ., స్టేట్‌ హైవేస్‌ 7,737 కి.మీ. మేర దెబ్బతిన్నాయి. ఈ పనులు చేపట్టేందుకు తక్షణం రూ.500 కోట్లు అవసరమని కృష్ణబాబు తెలిపారు. మరో 4,229 కి.మీ. రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 2వేల కోట్లు అవసరమన్నారు. వంతెనల నిర్మాణానికి రూ.3,850 కోట్లు కావాలని, 16వ ఆర్థిక సంఘం నుంచి ఈ నిధులు కోరదామని ఆయన ప్రతిపాదించారు. కాగా, ఆర్‌అండ్‌బీ వద్ద ఖాళీగా ఉన్న స్థలాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని మంత్రి చెప్పారు. జగన్‌ సర్కారు నిధులను మళ్లించడంతో నిలిచిపోయిన ఎన్‌డీబీ ప్రాజెక్టుల పనులను తిరిగి ప్రారంభించడానికి కాంట్రాక్టర్ట సమావేశం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈఎన్‌సీలకు జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలు

రహదారుల ప్యాచ్‌వర్క్‌లు, పునర్నిర్మాణ, విస్తరణ, అభివృద్ధి పనులను ఈఎన్‌సీ, సీఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని మంత్రి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు వారికి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పని విభజన చేస్తూ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Oct 10 , 2025 | 06:12 AM