కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు
ABN, Publish Date - May 20 , 2025 | 12:24 AM
తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నియోజకవర్గ మహానాడుకు
తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
ఆళ్లగడ్డ మే 19(ఆంద్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ రామ ఫంక్షన హాల్ లో నియోజకవర్గం మహానాడు నిర్వహించా రు. వివిధ మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు, నాయకులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. భూమా నాగిరెడ్డిగాని, శోభానాగిరెడ్డి గాని కార్యకర్తలను కుటుంబ సభ్యులను ఒకే విధంగా చేసేవారని కార్యకర్త లంటే వారి అంత ప్రేమ ఉండేదన్నారు. ప్రతి కార్యకర్తను తన కు టుంబ సభ్యులుగా చూస్తు వస్తున్నామని, త్వరలో సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స సెల్ ని ర్వ హిస్తామన్నారు. అ నంతరం టీడీపీ పరిశీలకుడు గోవర్ధనరెడ్డి మా ట్లాడుతూ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు చె ప్పింది చేసే వారని ఎన్నిక ల్లో ఇచ్చిన మాటను ఒక్కొ క్కటిగా అమలు చేసుకుం టు ముందుకు పోతున్నార న్నారు. కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జ యప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంత రం పలువురు నా యకు లు మాట్లాడారు. కార్య క్రమంలో టీడీపీ నియోజకరవ్గ నాయకులు భా ర్గవరామ్, శ్రీకాంతరెడ్డి, యామా గుర్రప్ప, కిరన్మయి, డాక్టర్ రాంగో పాల్‌రెడ్డి, సీఆర్ రెడ్డి, చింతకుంట లక్ష్మిదేవమ్మ, సీపీ వాసు, మధు, వసంత, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో తిరంగా ర్యాలీ
ఆళ్లగడ్డలో అమరవీరు డు మురళీ నాయక్‌కు ని వాళులు అర్పిస్తూ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహిం చారు. స్థానిక శ్రీరామ ఫంక్షన హాల్ నుంచి కొ వ్వొత్తులు చేతపట్టుకొని భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాల యం మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి పక్క న ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పూలమాల వేసి నివాళు లు అర్పించారు. నాయకులు భార్గవ్‌రామ్, గో వర్ధనరెడ్డి, శ్రీకాంత రెడ్డి, సీఐలు మురళీధర్ రెడ్డి, యుగంధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 12:24 AM