రేషన సక్రమంగా పంపిణీ చేయాలి: ఆర్డీవో
ABN, Publish Date - Jun 02 , 2025 | 12:20 AM
నిత్యావసర సరుకులను ప్రజల కు సక్రమంగా అందించాలని ఆర్డీవో కేపీ నరసింహులు అన్నారు.
రేషన షాపును ప్రారంభించి కార్డును అందిస్తున్న ఆర్డీవో నరసింహులు
డోన టౌన, జూన 1 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకులను ప్రజల కు సక్రమంగా అందించాలని ఆర్డీవో కేపీ నరసింహులు అన్నారు. ఆది వారం పట్టణంలోని ఇందిరానగర్‌లో రేషనషాపులను ఆర్డీవో ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన షాపుల్లో సరుకుల పట్టిక, స్టాక్ వివరాలు బోర్డులో రాసి ఉంచాలని ఆదేశించారు. తూకాల్లో మోసాలకు పాల్పడితే డీలర్‌షిప్‌ను తొలగించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగమణి, ఆర్‌ఐ మస్తాన, వీఆర్వోలు రామకృష్ణారెడ్డి, రామాంజనేయులు, ఖాజా, జి.మనోహర్, యూనిస్, సీనియర్ అసిస్టెంట్ కేవీ ఉపేంద్ర పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 12:20 AM