అత్యాచార నిందితుడికి జీవిత ఖైదు
ABN, Publish Date - Mar 18 , 2025 | 12:30 AM
ఒక మహిళను అత్యాచా రం చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మహిళా కోర్టు న్యాయాధికారి వి. లక్ష్మీరాజ్యం సోమవారం తీర్పు చెప్పారు.
కర్నూలు లీగల్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఒక మహిళను అత్యాచా రం చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మహిళా కోర్టు న్యాయాధికారి వి. లక్ష్మీరాజ్యం సోమవారం తీర్పు చెప్పారు. 2020 డిసెంబరు 5వ తేదీన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కోసిగి గ్రామానికి చెందిన బాధితురాలు తన అన్న ఆరోగ్యం బాగా లేకపోవడంతో సంజామల మండలం పేరుసోముల గ్రామ సమీపంలో చికిత్స ఇప్పించేందుకు వెళ్లింది. 2020 డిసెంబరు 3వ తేదీన అక్కడ బాధితురాలు నిద్రిస్తుండగా.. తన అన్న కనపడకపోవడంతో వెతకడానికి వెళ్లింది. పేరుసోముల గ్రామం చౌడేశ్వరి గుడి సమీపంలో బాధితురాలు వెళ్తుండగా.. మోటారు సైకిల్‌పై వచ్చిన నిందితుడు హరిక్రిష్ణ మీ అన్నను దగ్గరలో చూశానని, మాయమాటలు చెప్పి ఆ మహిళను తన వాహనంలో ఎక్కించు కుని వెళ్లి అత్యాచారం చేశాడు. తాను పో లీసులనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకితో కాల్చివేస్తానని బెదిరించా డు. ఈ విషయం మీద కొడుకుతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు నాగహరిక్రిష్ణపై కేసు నమోదు చేసి కర్నూలు ఏడో అదనపు జిల్లా సెషన్స కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. బాధితురాలికి నష్టపరిహారాన్ని చెల్లించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను న్యాయాధికారి ఆదేశించారు. ప్రాసిక్యూషన తరపున పీపీ ఎస్. నరేంద్రనాథ్ రెడ్డి వాదించారు.
Updated Date - Mar 18 , 2025 | 12:30 AM