ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాన చుక్క.. తప్పుతోంది లెక్క..!

ABN, Publish Date - May 28 , 2025 | 11:26 PM

విపత్తులు ఎలా విరుచుకుపడుతాయో.. ఎంతటి నష్టాన్ని మిగులుస్తాయో ఊహించడమే కష్టం.

కోసిగిలో నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్న ఏడబ్ల్యూఎస్‌

జిల్లాలో ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు 101, రెయినగేజ్‌ స్టేషన్లు 58

నిర్వహణ అస్తవ్యస్థం

నిరుపయోగంగా 61 ఏడబ్ల్యూఎస్‌, ఏఆర్‌జీఎస్‌లు

తహసీల్దారు కార్యాలయాల్లో పాత పద్దతుల్లోనే నమోదు

లెక్క పక్కాగా లేకపోతే రైతులకు నష్టమే

కర్నూలు, మే 28 (ఆంధ్రజ్యోతి): విపత్తులు ఎలా విరుచుకుపడుతాయో.. ఎంతటి నష్టాన్ని మిగులుస్తాయో ఊహించడమే కష్టం. విపత్తు విరుచుకుపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే వాతావరణ పరిస్థితులపై నిత్యం పరిశీలన ఉండాలి. ఎప్పుడు ఎక్కడ వర్షాలు పడుతాయి. ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది.. తదితర సమాచారం వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తుంది. వర్షపాతం నమోదు, వాతావరణం పరిస్థితులను అంచనా వేసేందుకు ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు 101, ఆటోమెటిక్‌ రెయినగేజ్‌ స్టేషన్లు 58 ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలు వల్ల 41 ఏడబ్ల్యూఎస్‌, 20 ఏఆర్‌జీఎస్‌లు పని చేయడం లేదు. అస్థవ్యస్తమైన నిర్వహణే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికీ తహసీల్దారు కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పాతపద్దతి ద్వారానే వర్షపాతాన్ని లెక్కిస్తున్నారు. దీంతో వర్షపాతం నమోదు కచ్చితత్వంపై నీలినీడలు అలుముకున్నాయి. కీలకమైన వర్షపాతం నమోదులో నిర్లక్ష్యం, నిర్వహణ లోపం రైతులకు శాపంగా మారుతోంది.

జిల్లాలో భారత వాతావరణ శాఖ (ఏఎండీ), రెవెన్యూ, జలవనరుల శాఖ వర్షపాతం, వాతావరణంలో వస్తున్న మార్పులపై అంచనాలు వేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు చేరవేస్తాయి. ప్రకృతి వైపరిత్యాల వల్ల అన్నదాతలు నష్టపోతే వాతావరణ ఆధారిత పంట బీమా అందాలంటే వర్షపాతం నమోదు అత్యంత కీలకం. అంతేకాదు ఎప్పటికప్పుడు వర్షపాతం నమోదు ద్వారా వేసి ఆయా ప్రాజెక్టులకు చేరే వరదను అంచనా వేసి, ప్రాజెక్టుల రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకుంటారు. వాన చుక్క లెక్క తప్పితే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిందే. అలాగే జలాశయాలు ప్రమాదంలో పడతాయి. ఇప్పటికీ రెవెన్యూ యంత్రాంగం 1871 నాటి పద్దతిలో వర్షపాతం నమోదు చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా మండలాల్లోని వివిధ గ్రామాల్లో 101 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్‌), 58 ఆటోమేటిక్‌ రెయినగేజ్‌ స్టేషన్లు (ఏఆర్‌జీఎస్‌) నెలకొల్పారు. సౌరశక్తి ఆధారంగా పని చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సంఘం కార్యాలయంతో అనుసంధానం చేయడంతో ఎంత వర్షం కురిసింది, వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి.. వంటి వివరాలు ఎప్పటికప్పుడు నేరుగా సదరు వెబ్‌సైట్‌లో నమోదవుతుంది. వీటితో పాటు రెవెన్యూ శాఖ ఏఆర్‌జీఎస్‌లు ద్వారా వర్షపాతం రికార్డులు చేస్తున్నారు. వీటితో పాటుగా ఇప్పటికీ మండల కేంద్రాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో అతిపురాతన పద్ధతి గాజుసీసా, గరాటులో పడిన వర్షపు చుక్కలను లెక్కిస్తున్నారు. ఎంతోకీలకమైన ఏడబ్ల్యూఎస్‌, ఏఆర్‌జీఎస్‌ నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిధులు ఇవ్వకపోవడంతో పలు స్టేషన్లు నిరుపయోగంగా మారాయి. పలు మండలాల్లో పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది.

ఫ నిరుపయోగంగా ఏడబ్ల్యూఎస్‌ స్టేషన్లు

నైరుతి రుతు పవనాలు ముందుగానే రావడం, జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కూటమి ప్రభుత్వం ఏడబ్ల్యూఎస్‌, ఏఆర్‌జీఎస్‌లు ఎలా మేరకు పని చేస్తున్నాయో..? తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో పలు స్టేషన్లు నిరుపయోగంగా మారాయి. 101 ఏడబ్ల్యూఎస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వివిధ కారణాలతో 41 నిరుపయోగంగా మారాయి. 58 ఏఆర్‌జీఎస్‌లకు ఉంటే 20 స్టేషన్లు మరమ్మతులు, నిర్వహణలోపం వల్ల అలంకారప్రాయంగా మారాయి. ఇలాగైతే వర్షపాతం, వాతావరణంలో వస్తున్న మార్పులు ఎలా అంచనా వేస్తారు.? సమాధానంలేని ప్రశ్న ఇది. కూటమి ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెలుగు చూస్తున్న లోపాలు ఇవి:

ఫ సి.బెళగల్‌ మండలంలో గుండ్రేవుల, కొత్తకోట, సి.బెళగల్‌లో ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్‌) ఏర్పాటు చేశారు. టిప్పింగ్‌ బకెట్‌లో దుమ్ము చేరడంతో ఏ ఒక్కటీ పని చేయకపోవడంతో వర్షపాతం నమోదు చేయడం కావడం లేదు. గూడూరులోని ఏడబ్ల్యూఎస్‌ పరిస్థితి ఇలాగే ఉంది.

ఫ కర్నూలు రూరల్‌ మండలం దిన్నెదేవరపాడు (10028-కార్బైడ్‌ ఫ్యాక్టరీ), 11967-ఎనహెచ-44 హంద్రీ బిడ్జి వద్ద, పూడూరు, జి.పుల్లారెడ్డి డెంటల్‌ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఏడబ్ల్యూఎస్‌లు అనిమోమీటర్‌ సెన్సార్‌ అందుబాటులో లేకపోవడం, టిప్పింగ్‌ బకెట్‌ రెయినగేజ్‌ పరికరం అందుబాటులో లేకపోవడంతో పని చేయడం లేదు.

ఫ ఓర్వకల్లు మండలం శకునాల, ఓర్వకల్లు, కాల్వబుగ్గలో ఏర్పాటు చేసిన ఏడబ్ల్యూఎస్‌లు సాంకేతిక సమస్యలు కారణంగా వర్షపాతం నమోదు చేయడం లేదు. మంత్రాలయం మండలం వగరూరులోని ఏడబ్ల్యూఎస్‌ విండ్‌ వేవ్‌ సక్రమంగా పని చేయడం లేదు.

ఫ కౌతాళం మండలం నదిచాగి, హాల్వి, కౌతాళంలో ఏడబ్ల్యూఎస్‌లు డేటా లాగర్‌ పని చేయక, బేరోమీటర్‌ కనిపించకపోవడం, విండ్‌ వేవ్‌ విరిగిపోవడంతో సక్రమంగా పని చేయడం లేదు. దీంతో వాన లెక్క తప్పుతుంది. ఆదోని మండలంలోని గణేకల్లు, కల్లుబావిలో ఏర్పాటు చేసిన ఏడబ్ల్యూఎస్‌లు డేటా లాగర్‌ పని చేయడం లేదు. పెద్దకడుబూరులోని ఏడబ్ల్యూఎస్‌ పరిస్థితి కూడా ఇదే. హోళగుందలోని ఏడబ్ల్యూఎస్‌ టిప్పింగ్‌ బకెట్‌లో దుమ్ము చేరడంతో వర్షపాతం నమోదు కావడం లేదు.

ఫ గోనేగండ్ల మండలం బి.అగ్రహారం విద్యుత సబ్‌ స్టేషనలో ఏర్పాటు చేసిన ఏడబ్ల్యూఎస్‌లో బేరోమీటర్‌, గ్లోబల్‌ రేడియేషన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం వెనుకాల ఉన్న ఏడబ్ల్యూఎస్‌లో కూడా గ్లోబల్‌ రేడియేషన పరికరం లేదు. మండలం కేంద్రం కోసిగిలో డేటా లాగర్‌ సక్రమంగా పని చేయడంలేదు.

ఫ చిప్పగిరి మండలం చిప్పగిరి విద్యుత సబ్‌ స్టేషనలోని ఏడబ్ల్యూఎస్‌ను ఆ శాఖ సిబ్బంది తొలగించారు. నగరడోణలో టిప్పింగ్‌ బకెట్‌లో దుమ్ము చేరి వర్షపాతం నమోదు చేయడం లేదు. ఆలూరు మండలం కమ్మరచేడులో టిప్పింగ్‌ బకెట్‌లో దుమ్ముపడి వర్షపాతం నమోదు చేయడం లేదు. ఆస్పరి మండలం కైరుప్పలో సోలార్‌ ప్యానెల్‌, డేటా లాగర్‌ దెబ్బతిని పని చేయడం లేదు.

ఫ దేవనకొండ మండలం ఈదురదేవరబండ ఏడబ్ల్యూఎస్‌కు సక్రమంగా కంచె వేయలేదు. మెపుపు సెన్సార్‌ పని చేయడం లేదు. రెయినగేజ్‌ నీరు, దుమ్ముతో నిండిపోయింది. దేవనకొండలో ఎనిమోమీటర్‌ పాడైపోయింది. రెయినగేజ్‌ దుమ్ము, ఇతర చెత్తతో నిండిపోవడంతో వర్షపాతం నమోదు కావడం లేదు. గుండ్లకొండ ఏడబ్ల్యూఎస్‌ రెయిన గేజ్‌ వంగిపోయింది. నీరు, దుమ్ముతో నిండిపోయింది. హాలహర్వి మండలం గూళ్యం ఏడబ్ల్యూఎస్‌ టిప్పింగ్‌ బకెట్‌లో దుమ్ము చేరడంతో వర్షపాతం నమోదు కావడం లేదు.

ఫ తాలుకా కేంద్రం పత్తికొండ ఏడబ్ల్యూఎస్‌ టిప్పింగ్‌ బకెట్‌లో దుమ్ము చేరడంతో వర్షపాతం నమోదు కావడం లేదు. విండ్‌ వేన చేడిపోయింది. పందికోనలో ఎనిమోమీటర్‌, విండ్‌ వేన లేదు. మండల కేంద్రం మద్దికెరలో టిప్పింగ్‌ బకెట్‌లో దుమ్ముతో నిండిపోవడంతో వర్షపాతం నమోదు కావడం లేదు.

ఫ జిల్లాలో ఏఆర్‌జీఎస్‌లు 58 ఏర్పాటు చేస్తే.. 20 పని చేయడం లేదు. గూడూరు మండలంలో మూడు ఏఆర్‌జీఎస్‌లు చోరికి గురైయ్యాయి.

ఏడబ్ల్యూఎస్‌ సేకరించే వాతావరణ వివరాలు

కేంద్ర మార్గదర్శకాలు మేరకు ప్రతి 5 కిలోమీటర్లు విస్తృతి లేదా 7,845 హెక్టార్లకు ఒక ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన (ఏడబ్ల్యూఎస్‌) ఏర్పాటు చేయాలి. ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురిసిందో తెలిస్తే.. అక్కడి నుంచి ఎంత వరద ప్రవాహం వస్తుంది..? ఎటువైపు ప్రవహిస్తుంది..? ఏ నదులు ఉప్పొంగే అవకాశం ఉంది..? ముందే అంచనా వేసి విపత్తుల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చవచ్చు. ఈ కేంద్రాలు ద్వారా వర్షపాతం నమోదుతో పాటు గాలిలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలి వేగం, దిశ, వాతావరణ పీడనం, సూర్యకాంతి సమయం (సౌర వికిరణం) అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సంఘం వెబ్‌సైట్‌లో నమోదు అవుతుంది.

ఫ ఇప్పటికీ పాత పద్దతే

ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినా.. నిర్వహణ లోపం కారణంగా రెవిన్యూ అధికారులు పాత పద్దతిలోనే వర్షపాతం నమోదు చేస్తున్నారు. మండల తహసీల్దారు కార్యాలయాల్లో పని చేసే ఏఎస్‌ఓలు వాన చుక్కలు లెక్కిస్తారు. తహసీల్దారు కార్యాలయం పరిధిలో రెయినగేజ్‌గా పిలిచే.. అడుగున్నర లేదా రెండడుగులు ఎత్తు ఉండే ఓ డబ్బా, అందులో చిన్నపాటి గాజుసీసా, గరాటు ఉంటుంది.. మిల్లిమీటర్లు, సెంటీ మీటర్లు కొలతలు ఉంటాయి. దీని ద్వారా ఏ రోజు ఎంత వర్షం పడిందో లెక్కిస్తారు. ఎంపిక ప్రదేశాల్లో, నిర్ణీత ఎత్తులో రెయినగేజ్‌ ఏర్పాటు చేస్తారు. వర్షం కురిసినప్పుడు పైన ఉన్న గరాటు ద్వారా గాజు సీసాలోకి వర్షపు నీరు చేరుతుంది. ఆ నీళ్లు ఎంత ఎత్తున చేరితే అన్ని సెంటీమీటర్లు/మిల్లీ మీటర్లు వర్షం పడిందని అంచనా వేస్తారు. చెట్లు, భవనాలకు సమీపంలో, అటుఇటూ గాలికి మళ్లేలా ఉన్న ఎదుడు దిగుడు ప్రదేశాల్లో ఈ రెయినగేజ్‌లు ఏర్పాటు చేస్తే తప్పుడు లెక్కలు వస్తాయి. ఇప్పటికీ 1871 సంవత్సరం నాటి పాత పద్దతి ద్వారానే వాన చుక్కలు లెక్కించడం కొసమెరుపు.

ఫ జలవనరుల శాఖ పర్యవేక్షణలో..

జలవనరుల శాఖ గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ ఆటోమేటిక్‌ ఆల్‌ వెదర్‌ స్టేషన ఏర్పాటు చేసింది. గంట గంటకు, 24 గంటలకు వర్షపాతం, సోలార్‌ రేడియేషన (సూర్యకాంతి సమయం), గాలి వేగం, విండ్‌ డైరెక్షన గాలి వీచేదిశ, నీటి ఆవిరి, వాతావరణంలో తేమ శాతం అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన అజిస్తా అనే ప్రైవేటు సంస్థ నిర్వహణలో ఉంది. గోరుకల్లు జలాశయం, సుంకేసుల బ్యారేజీ, బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద మరో మూడు ఆటోమేటిక్‌ ఆల్‌ వెదర్‌ స్టేషన్లు కొత్తగా ఏర్పాటుకు ఇరిగేషన శాఖ శ్రీకారం చుట్టింది.

ఫ జిల్లాలో ఏడబ్ల్యూఎస్‌, ఏఆర్‌జీఎస్‌లు పని తీరు ఇలా:

--------------

కేంద్రాలు ఏర్పాటు చేసినవి పని చేస్తున్నవి పని చేయనివి

--------------

ఏడబ్ల్యూఎస్‌ 101 60 41

ఏఆర్‌జీఎస్‌ 58 38 20

-----------------------------------

మొత్తం 159 98 61

---------------------------------

Updated Date - May 30 , 2025 | 03:02 PM